BigTV English

Jamili Elections: జమిలి ‘బిల్లు’కు లైన్ క్లియర్? లోక్‌సభలో ఓటింగ్.. అంత మంది వ్యతిరేకించినా..

Jamili Elections:  జమిలి ‘బిల్లు’కు లైన్ క్లియర్? లోక్‌సభలో ఓటింగ్.. అంత మంది వ్యతిరేకించినా..

Jamili Elections: ఎట్టకేలకు జమిలి ఎన్నికలు బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపింది. 2029లో నిర్వహించేలా కేంద్రం సన్నాహాలు చేస్తోంది.


బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ మాట్లాడారు. సమాఖ్య స్ఫూర్తికి జమిలి బిల్లు విరుద్ధం కాదన్నారు. అలాగని రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం కాదన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదని, 1983 నుంచి నిర్వహించాలనే డిమాండ్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఎన్డీయే కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీ దీనికి మద్దతుగా మాట్లాడింది. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ బిల్లుపై మాట్లాడారు. విపక్ష పార్టీలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకె, ఎంఐఎం, ఎన్‌సీపీ (శరద్‌పవార్ వర్గం), శివసేన(యూబీటీ) సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. 129వ సవరణ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.


జమిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తెలిపారు. దీన్ని తక్షణమే కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లు దారితీస్తుందన్నారు ఎస్పీ నేత ధర్మేంద్రయాదవ్. ఈ ఎన్నికలు నియంతృత్వానికి దారి తీస్తుందన్నారు.

ALSO READ: శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యా యత్నం, ఎందుకిలా?

ఇది ముమ్మాటికీ రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమేనని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిదని, మనకు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదన్నారు. గతంలో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లును చర్చ లేకుండా చేసి ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారాయన. ఆ తర్వాత బిల్లును సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు.

ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ఓటింగ్ నిర్వహించింది. బ్యాలెట్ విధానంలో ఓటింగ్‌ను ప్రవేశపెట్టారు స్పీకర్. మెజార్టీ సభ్యులు బిల్లుకు మద్దతు ఇచ్చారు. బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ తర్వాత మధ్యాహ్నం మూడుగంటలకు లోక్‌సభ వాయదా పడింది.

జమిలి ఎన్నికల బిల్లు జేపీసీకి పంపడంపై కొత్త పార్లమెంటులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. ఎలక్ట్రానిక్ పద్దతిలో జరిగిన ఓటింగ్‌కు 369 ఎంపీలు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 220 మంది, వ్యతిరేకంగా 149 ఓట్లు వచ్చాయి. దీని తర్వాత వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుకు సుదీర్ఘంగా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగనుంది.

ఈ బిల్లులో కీలకమైన అంశం మరొకటి ఉంది. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగి రెండేళ్ల తర్వాత ప్రభుత్వం కూలిపోతే, మిగిలిన మూడేళ్లకు తదుపరి ప్రభుత్వం ఉంటుందన్నారు. ప్రతీ ఐదేళ్లకు లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగడమే ప్రధానమైన పాయింట్.

Related News

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Big Stories

×