Big Stories

Jammu Kashmir Aseembly Elections : జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. సీఈసీ క్లారిటీ..

Jammu Kashmir Elections

- Advertisement -

Jammu Kashmir Assembly Elections : జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చేసింది. లోక్ సభ ఎలక్షన్స్ తోపాటు జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని తొలుత ప్రచారం సాగింది. అయితే ఈ విషయం సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టత ఇచ్చేశారు. భద్రతా కారణాల వల్ల కాశ్మీర్ లో రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యందని తెలిపారు.

- Advertisement -

జమ్మూకాశ్మీర్ లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారనే అంశంపైనా రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అక్కడ అసెంబ్లీ  ఎలక్షన్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి భద్రత కల్పించడం చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.  దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయంలో కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల జరపడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ పైనా రాజీవ్ కుమార్ స్పందించారు. జమ్మూకాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రస్తావించారు. ఈ చట్టం ప్రకారం జమ్మాకాశ్మీర్ లో 107 అసెంబ్లీ స్థానాలున్నాయని తెలిపారు. అందులో 24 స్థానాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ కమిషన్ నివేదికలో సీట్ల పరంగా మార్పులున్నాయని తెలిపారు. ఈ అంశంపై స్పష్టత తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

Also Read : 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు.. ఏపీలో మే 13న పోలింగ్..

జమ్మూకాశ్మీర్ లోని రాజకీయ పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరాయని రాజీవ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. అయితే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు.. కేంద్రాన్ని ఆదేశించింది. 2024 సెప్టెంబర్ 30లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి ఈసీకి సూచించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News