BigTV English

Air Fresheners : పూల వ్యర్థాలతో ఎయిర్ ఫ్రెషనర్..!

Air Fresheners : పూల వ్యర్థాలతో ఎయిర్ ఫ్రెషనర్..!
Air Fresheners

Air Fresheners : దేశంలో ఏటా నదీజలాల్లో కలుస్తున్న పూల వ్యర్థాల మొత్తం ఎంతో ఊహించగలరా? ఏకంగా 80 లక్షల టన్నులు! ఆలయాల్లో పూజల అనంతరం వ్యర్థాలుగా మిగులుతున్న ఈ పుష్పాలే రాజీవ్‌శర్మకు ఆదాయవనరుగా మారాయి. ఆలయాల నుంచి వచ్చే 1500 కిలోల పూల వ్యర్థాలతో ఆల్వే అనే పర్యావరణహితమైన ఎయిర్ ఫ్రెషనర్ల తయారీకి శ్రీకారం చుట్టాడు.


వడ్రంగం పని శర్మ నేపథ్యమైనా.. అతనిలో ఇన్నొవేటర్ దాగి ఉన్నాడు. పూల వ్యర్థాల తో ఎయిర్ ఫ్రెషనర్ తయారీ ఆలోచన కలగడం వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది. 2022లో శర్మ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. ఒకటే వాంతులు, తల తిరుగుడు, తలనొప్పి. దీంతో రెండు రోజులు ఆస్పత్రికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆకస్మికంగా ఎందుకిలా జరిగిందా అని తీవ్రంగా యోచించాడు.

అంతకుముందే ఇంటికి తెచ్చిన ఎయిర్ ఫ్రెషనర్ తనకు పడలేదని గ్రహించాడు. దాంతో సహజమైన సువాసనలు వెదజల్లే ఫ్రెషనర్లు అయితే ఎలాంటి అలర్జీలు ఉండవని భావించాడు. సొంతంగా ఎయిర్ ఫ్రెషనర్ తయారుచేశారు. సాధారణంగా ఎయిర్ ఫ్రెషనర్లు వందకుపైగా వివిధ రసాయనాలు విడుదల చేస్తాయని.. ఫలితంగా మైగ్రెన్ తలనొప్పి, ఆస్త్మా, ఇతర సమస్యలు కచ్చితంగా ఉంటాయని రిసెర్చర్లు చెబుతున్నారు.


ఎయిర్ ఫ్రెషనర్ వెదజల్లే వాసనల మోతాదు స్వల్పమే అయినా.. ఆరోగ్యపరంగా ప్రతికూల ప్రభావాలు ఎన్నో ఉంటాయి. దీంతో సహజ సువాసనలను అందించే ఎయిర్ ప్రెషనర్ తయారు చేయాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది. శర్మ వినూత్న ఆలోచన గురించి తెలుసుకున్న ఏపీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ప్రొఫెసర్లు అతనికి సాయం అందించారు.

8 నెలల శ్రమ, 20 రకాల ప్రొటోటైప్స్‌ రూపకల్పన అనంతరం ఆల్వే ఎయిర్ ఫ్రెషనర్ ఊపిరి పోసుకుంది. ఈ స్టార్టప్‌ను శర్మ తన తల్లి సోనీదేవితో కలిసి సహజసిద్ధమైన ఎయిర్ ఫ్రెషనర్లను స్వయంగా ఇంటి వద్దే నిర్వహిస్తున్నాడు. గత 5 నెలల్లోనే 850 వరకు ఎయిర్ ఫ్రెషనర్లను వారివ్దరూ విక్రయించగలిగాడు. దీంతో రూ.2 లక్షల వరకు ఆదాయం లభించడం విశేషం.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×