Viral Bride Groom Video: శుభమా అంటూ పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లి కొడుకు నూతన వస్త్రాలు ధరించి సిద్ధమయ్యాడు. ఇంకేముంది సినిమా తరహాలో ఒక యువతి వచ్చింది. రావడం రావడమే పెళ్లి కొడుకును పిచ్చ కొట్టుడు కొట్టింది. ఇక అంతే పెళ్లికి వచ్చిన వారు బిగ్ షాక్. అసలేం జరిగిందని తెలుసుకున్న పెళ్లి వారు ఔరా అంటూ.. తమ నోటికి మాట చెప్పి మరీ అక్కడి నుండి వెళ్లి పోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే?
కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ పెళ్లి మండపం ఊహించని సన్నివేశానికి వేదిక అయింది. వరుడు ఎంచక్కా పెళ్లి వస్త్రాలు ధరించి కూర్చుని, పెళ్లి హాలులో మంగళ వాయిద్యాలు వినిపిస్తున్న వేళ.. ఒక్కసారిగా ఓ యువతి అందరి ముందే ఆయనను చెప్పుతో కొట్టడం ప్రారంభించింది. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. కానీ కాసేపట్లో ఆమె ఎందుకు అలా చేసిందో తెలిసాక.. అందరూ తలపట్టుకున్నారు. ఎందుకంటే ఆ యువతి ఎవరో కాదు, ఆ వరుడి మొదటి భార్య!
మొదటి పెళ్లి.. నాలుగు ఏళ్లు.. తర్వాత కట్నం కోసమే?
ఈ కథలో యువతి పేరు తనూజ. ఆమెకు నాలుగేళ్ల క్రితం కార్తీక్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. మొదటి నుంచి కూడా అతని ప్రవర్తనపై తనూజకు అనుమానాలే. అయితే వివాహ బంధాన్ని గౌరవించి ఆమె సహనంగా ఉండింది. కానీ, కార్తీక్ మాత్రం పూర్తిగా వేరు. బంగారం కోసం, కట్నం కోసం దేనికైనా రెడీ అనే తరహాలో మారాడు. ఈ నేపథ్యంలో, తనూజను వదిలి పెట్టకుండా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.
రెండో పెళ్లికి రంగం సిద్ధం.. కానీ ముసుగుతీసిన నిజం!
కార్తీక్ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఫ్యామిలీ, మిత్రులు, పత్రికలు, ఫోటోగ్రాఫర్లు.. అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కానీ తనూజకు ఇది తెలిసిపోయింది. వెంటనే ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి ఆ పెళ్లి వేదికకు వెళ్లింది. అక్కడే అందరి ముందే.. మంగళ వాయిద్యాల నడుమ.. తన భర్తపై చెప్పుతో దాడి చేసింది. కార్తీక్ షాక్‌లోకి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్నవారు తొలుత ఆశ్చర్యపోయారు, ఆ తర్వాత విషయం తెలిసాక ఆమెకు మద్దతుగా నిలిచారు.
ఇది కేవలం బదులు కాదు.. ఇదో గుణపాఠం – తనూజ
తనూజ ఘాటుగా స్పందిస్తూ.. నన్ను మోసం చేసి మరో పెళ్లికి ప్రయత్నించడమా? ఇది నన్ను కాదు, ఒక్క మహిళను కాదు.. మహిళా జాతిని అవమానించడమే. అందుకే అందరి ముందే ఈ గుణపాఠం ఇచ్చాను అని చెప్పింది. ఆమె ధైర్యం చూసి అక్కడ ఉన్న మహిళలు ఆమెకు మద్దతుగా నిలిచారు.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. కేసు నమోదు
తనూజ కార్తీక్‌పై మోసం, కట్నం డిమాండ్ వంటి అభియోగాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని గుణపాఠంగా తీసుకోవాలి, ఇంకా ఎంత మంది కార్తీక్‌లు ఉన్నారో తెలీదు.. కానీ ఒక్క తనూజ సరిపోతుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహిళను మోసం చేసి, రెండో పెళ్లికి వెళ్తే ఏమవుతుందో తెలియాలంటే ఈ వీడియో ఒక్కటే చాలు అంటున్నారు.
Also Read: AP Smart Meter Issue: కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా? ఇక ఆ భారానికి సెలవేనా?
అసలు సమస్య.. కట్నమేనా?
ఈ ఘటన వెనుక అసలు మూల కారణం కట్నం అని అందరూ అంటున్నారు. కార్తీక్ మొదటి వివాహంలో తగినంత కట్నం రాలేదన్న భావనతో మళ్ళీ సంపన్న కుటుంబంతో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడన్నది ఆరోపణ. ఇది ఇంకా దర్యాప్తులో ఉన్నా, సామాజికంగా ఇది చాలా పెద్ద సమస్య.
కట్టుబాటు తప్పదు.. బాధ్యత ముఖ్యమే!
ఈ ఘటన ద్వారా మనం గుర్తించాల్సింది.. వివాహం అనేది ఒప్పందం కాదు.. బాధ్యత. ఒక్కొక్కరి జీవితాల్లో మోసం చేసే ప్రయత్నం వల్ల వారి కుటుంబాలు, భవిష్యత్తు బలైపోతాయి. ముఖ్యంగా మహిళలు ఎంతగా నమ్మినా, బాధలు భరించినా.. ఒక చోటకు వచ్చాక నిజాన్ని ఎదురించి నిలబడే ధైర్యం చూపుతున్నారు. తనూజ లాంటి మహిళల ధైర్యం, న్యాయాన్ని సాధించాలనే సంకల్పం నేటి సమాజానికి ఒక అద్దం.
పెళ్లి ఒక పవిత్రమైన బంధం. అది ఆర్థిక లావాదేవీ కాదు. ఈ ఘటన నిరూపించిన విషయమేమిటంటే.. అత్యాశ, కట్నం కోసం రెండో పెళ్లికి వెళితే.. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. ఆ వెలుగులో పడ్డాక, దాగిన ముసుగు నశిస్తుంది. కార్తీక్ లాంటి వారు ఎన్ని అర్హతలు ఉన్నా.. నైతికత లేకపోతే ప్రజలు మాత్రం క్షమించరని మహిళా సమాజం అంటోంది.