JPC Committee: వక్ఫ్ చట్టం కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లుపై కేంద్రం ఒక్క అడుగు వెనక్కు వేసింది. గురువారం లోక్ సభలో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా, విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపించనున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. జేపీసి ఏర్పాటుపై సభలోని అన్ని పార్టీల నేతలతోనూ మాట్లాడనున్నట్లు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు.
Also Read: అఖిలేష్ Vs అమిత్ షా.. దద్దరిల్లిన లోక్‌సభ
కాగా, 31 మంది సభ్యులతో జేపీసిని ఏర్పాటు చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు చోటు కల్పించింది. మొత్తం 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయగా, లోక్ సభ్ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మందికి అవకాశం కల్పించారు. అందులో తెలంగాణ నుంచి ఎంపీలు అసదుద్దీన్, డీకే అరణకు చోటు దక్కింది. అదేవిధంగా ఏపీ నుంచి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు చోటు దక్కింది.