BigTV English

K Armstrong Murder: తమిళనాడు బిఎస్పీ నాయకుడి హత్య కేసు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడి మృతి..!

తమిళనాడులో సంచలనం రేపిన బిఎస్పీ నాయకుడు కె ఆర్మెస్ట్రాంగ్ హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. పోలీసుల ఎన్ కౌంటర్‌లో శనివారం సాయంత్రం ఒక నిందితుడు చనిపోయాడు.

K Armstrong Murder: తమిళనాడు బిఎస్పీ నాయకుడి హత్య కేసు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడి మృతి..!

BSP Leader K Armstrong Murder Case Update: తమిళనాడులో సంచలనం రేపిన బిఎస్పీ నాయకుడు కె ఆర్మెస్ట్రాంగ్ హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. పోలీసుల ఎన్ కౌంటర్‌లో శనివారం సాయంత్రం ఒక నిందితుడు చనిపోయాడు.


పోలీసుల కథనం ప్రకారం.. కేసు విచారణ కోసం హత్య జరిగిన ప్రాంతానికి నిందితుడు తిరువేంగదామ్‌ని పోలీసులు తీసుకువెళ్లారు. అక్కడ ఘటనా స్థలంలో నిందితులు హత్యకోసం ఉపయోగించిన ఆయుధాలు దాచిపెట్టారు. వాటిని వెలికి తీసే క్రమంలో నిందితుడు పోలీసులపై కాల్పులు చేశాడు.

పోలీసులు అతడిపై చేసిన ఎదురుకాల్పుల్లో నిందితునికి బుల్లెట్ గాయలాయ్యాయి. పోలీసులు నిందితుడు తిరువేంగదామ్‌ని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. డాక్టర్లు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.


ఇంతకుమందు తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన బిఎస్పీ నాయకుడు కె ఆర్మ్ స్ట్రాంగ్‌ని ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు బైకులపై వచ్చి కత్తులతో నరికి చంపారు. హత్య జరిగిన సమయంలో ఆర్మ్ స్ట్రాంగ్.. చెన్నైలోని సెంబియం ప్రాంతంలో తన ఇంట్లో పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో ఉన్నారు. బైక్ పై వచ్చిన దుండగులు ఆయనపై ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆయన మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచారు.

Also Read: నా భర్తపై గవర్నర్ కొడుకు దాడి చేశాడు.. ఒడిశా రాజ్ భవన్‌ సిబ్బంది భార్య

ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో ఆరుగురు నిందితులలో తిరువేంగదామ్‌ ఒకడు.

వృత్తి రీత్యా ఒక లాయర్ అయిన కెఆర్మ్ స్ట్రాంగ్ .. 2006లో చెన్నై కార్పోరేషన్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించాడు. రెండేళ్ల క్రితం ఆయన ఒక భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించి బిఎస్పీ అధినేత్రి మాయావతిని ఆహ్వానించాడు. అప్పటి నుంచి ఆయన తమిళ మీడియాలో దళితుల నాయకుడిగా పాపులర్ అయ్యాడు.

ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసుని సిబిఐ విచారణ చేయాలని మాయావతి డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ హత్య కేసుని సీరియస్ విచారణ చేయించడం లేదని ఆమె ఆరోపణలు చేస్తూ.. సిబిఐ ఈ కేసు విచారణ చేపట్టాలని కోరారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×