Big Stories

financial assistance: కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం

Financial assistance to victims: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించింది. కర్ణాటకలోని బెళగావిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జ్ రణ్ దీప్ సుర్జేవాలా తెలిపారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమక్షంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

- Advertisement -

బాధితులు వందల సంఖ్యలో ఉన్నట్లుగా తెలుస్తోందని, వారికి ఆర్థిక సాయం అందించాలని సీఎం సిద్ధ రామయ్య నిర్ణయించినట్లు సుర్జేవాలా తెలిపారు. ఆ కేసుకు సంబంధించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేశారన్నారు. జేడీఎస్.. బీజేపీ కూటమిలో ఉన్నందునే.. వారిని రక్షించేందుకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశం విడిచి పారిపోకుండా ప్రజ్వల్ ను విదేశాంగ శాఖ ఎందుకు అడ్డుకులోకేపోయిందని, నిందితుడికి ఉన్న దౌత్య పాస్ పోర్టును ఎందుకు రద్దు చేయలేదని నిలదీశారు.

- Advertisement -

Also Read: నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. అరగంట పాటు నిలిచిపోయిన రైలు!

ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మాట్లాడుతూ.. ప్రజ్వల్ ను స్వదేశానికి రప్పించేందుకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే.. బాధితుల కోసం దర్యాప్తు సంస్థ ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎవరైనా ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు ఉంటే ఆ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపినట్లు సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News