Big Stories

IPL 54th Match PBKS Vs CSK: తిప్పేసిన జడేజా.. చెన్నైతో పోరులో చిత్తుగా ఓడిన పంజాబ్..!

IPL 2024 54th Match – Punjab Kings Vs Chennai Super Kings Highlights: ఐపీఎల్ లో మ్యాచ్ లన్నీ ఏదో రూపంలో ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొన్ననే 261 పరుగుల టార్గెట్ ని ఉఫ్ మని ఊదేసిన పంజాబ్ కింగ్స్ నేడు చెన్నయ్ తో జరిగిన మ్యాచ్ లో 167 పరుగులు చేయలేక చతికిలపడింది.

- Advertisement -

టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నయ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. దీంతో 28 పరుగుల తేడాతో చెన్నయ్ విజయం సాధించింది. ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. 3 వ స్థానంలో నిలిచింది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ కి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ జానీ బెయిర్ స్టో (7), రిలీ రొసోవ్ (0) ఇలా త్వరగా అయిపోయారు. దీంతో 2 ఓవర్లలో 9 పరుగులకు 2 వికెట్లు పోయి గిలగిల్లాడింది. తర్వాత మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (30) కొంచెం జాగ్రత్తగా ఆడి నిలబెట్టాడు. తనకి శశాంక్ సింగ్ (27) సపోర్ట్ గా నిలిచాడు.

కానీ వీరి భాగస్వామ్యానికి 62 పరుగుల వద్ద తెరపడింది. ఇకంతే బ్రేకుల్లేని బండిలా వికెట్లు కోల్పోతూ పంజాబ్ వెళ్లిపోయింది. చివర్లో హార్పర్ బ్రార్ (17), హర్షల్ పటేల్ (12), రాహుల్ చాహర్ (16), రబాడ(11), కెప్టెన్ శామ్ కర్రాన్ (7) ఇలా ఏదో చుట్టుపు చూపుగా వచ్చి వెళ్లిపోయారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగుల వద్ద పంజాబ్ ఆగిపోయింది. దీంతో 28 పరుగుల తేడాతో చెన్నయ్ చేతిలో పరాజయం పాలైంది.

చెన్నయ్ బౌలింగులో మిచెల్ సాంట్నర్ 1, తుషార్ దేశ్ పాండే 2, రవీంద్ర జడేజా 3, సిమర్జీత్ సింగ్ 2, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు.

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నయ్ కూడా ఏమంత గొప్పగా ఆడలేదు. ఓపెనర్ ఆజ్యింక రహానె (9) ఎప్పటిలా త్వరగా అయిపోయాడు. కెప్టెన్ రుతురాజ్ (32), డేరి మిచెల్ (30) చేసి కాసేపు ఆటను నిలబెట్టారు. తర్వాత వచ్చిన శివమ్ దుబె ఈసారి గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. మొయిన్ ఆలీ (17) చేసి అవుట్ అయ్యాడు.

ఇప్పుడు అసలైన మ్యాచ్ టర్నింగ్ చేసిన ఆటను రవీంద్ర జడేజా ఆడాడు. 26 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేశాడు. సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ విన్నర్ గా మారాడు. అటు బౌలింగులో 3 వికెట్లు తీశాడు. ఇటు బ్యాటింగ్ తో జట్టుని నిలబెట్టాడు. మ్యాచ్ ని గెలిపించాడు.

Also Read: ఆర్సీబీ జైత్రయాత్ర.. గుజరాత్ పై ఘన విజయం

శార్దూల్ ఠాకూర్ (17) తర్వాత ధోనీ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. తుషార్ దేశ్ పాండే కూడా గోల్డెన్ డక్ అయ్యాడు. మొత్తానికి చెన్నయ్ జట్టులో ముగ్గురు గోల్డెన్ డకౌట్లు అయ్యారు. ఏమైతేనేం 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేశారు. అనంతరం బౌలర్లు మ్యాచ్ ని నిలబెట్టి, చెన్నయ్ కి విజయాన్ని అందించారు.

పంజాబ్ బౌలింగులో అర్షదీప్ 2, శామ్ కర్రన్ 1, రాహుల్ చాహర్ 3, హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News