Gajulu Gajulu Gala Gala: గాజులు గాజులు గాజులు గలగల అంటూ వచ్చిన పాట ఏ ముహూర్తాన మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిందో కానీ అప్పటి నుండి ఎక్కడ చూసినా రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్యనే దర్శనమిస్తుంది.అప్పటికే పలు షార్ట్ ఫిలిమ్స్ ,ఫోక్ సాంగ్స్ చేసినా ఈ గాజులు గాజులు గాజులు గలగల పాటతోనే ఓవర్ నైట్ క్రేజ్ కొట్టేసింది .ఇక ఈ పాట ఇప్పటికి ఏకంగా 25మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.
అయితే ఎన్ని విమర్శలు ఎదురైనా ఎక్కడా తగ్గకుండా వరుస సాంగ్స్ చేసుకుంటూ పోతుంది రాధమ్మ కూతురు. ఈ క్రమంలోనే కార్తీక మాసం కావడంతో ఈ సారి అయ్యప్ప పాటని పాడి నెట్టింట్లోకి వదిలింది.అయితే అది కూడా సూపర్ హిట్ అయిన గాజుల గాజుల గల గల పాటని పోలి ఉండటం గమనార్హం.
ఇక పాట విషయానికి వస్తే ఈ పాటని రాధమ్మ కూతురు ,సింహాద్రి దుర్గం కలిసి రాయగా ఎప్పటిలాగే రాధమ్మ కూతురు పాటని పాడింది.ఇక దీనికి సంగీతం నవీన్ నంబారి అందించగా ఇందులో రాధమ్మ కూతురుతో పాటు చిన్నారి పర్ణిక కనిపించి అలరించింది.
దీంతో పాట ఇలా నెట్టింట్లోకి వచ్చిందో లేదో అప్పుడే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.ఎప్పటిలాగే పాట బాగుంది,పాటలో నటించిన పర్ణిక పాప బాగుంది ,రాధమ్మ కూతురు ఇలాగే మరిన్ని పాటలు పాడాలంటూ కొంతమంది అంటే గొంతుని సానబెడితే పాటలు ఇంకా బాగా పడవచ్చు అంటూ మెచ్చుకుంటున్నారు కొందరు నెటిజన్లు.
ఎదో అమ్మవారి పాట హిట్ అయింది కదా అని
అయితే ఈ ప్రశంసల కన్నా ఎక్కువ వివాదాలు రాధమ్మ కూతురుని చుట్టు ముట్టాయాయి.భావాన్ని అమ్మ వారి పాటలాగే ఇందులో కూడా గజ్జెలు గజ్జెలు అనే పదం వాడటంతో ఫైర్ అయ్యారు నెటిజన్లు.అసలు అయ్యప్ప స్వామికి గజ్జెలు అనేవే ఉండవని ఎదో అమ్మవారి పాట హిట్ అయింది కదా.. అని ఇలా అయ్యప్పకు కూడా గజ్జెలు అంటూ పాడటం అసలేం బాగోలేదని మండిపడ్డారు.
అయితే అయ్యప్ప కి గజ్జెలు ఉన్నాయని చెప్పడం తమ ఉద్దేశం కాదని ,కేవలం సంగీత వైభవానికి గుర్తుగా ఈ పదం వాడమని ,అంతే తప్ప గజ్జెలు అయ్యప్ప ధరిస్తాడని ఎక్కడా చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
అయ్యప్ప మాల మీద పడ్డావా తల్లీ
మరోవైపు రాధమ్మ కూతురు గొంతు పై కూడా తీవ్ర విమర్శలు చేసుకొచ్చారు.అసలు ఆమె గాత్రం ఏమీ బాగోలేదని కొందరంటే ,అప్పుడు గాజులు గాజులు గాజులు గల గల అంటూ భవాని మాల మీద పడితే ఇపుడు గజ్జెలు గజ్జెలు అంటూ అయ్యప్ప మాల మీద పడ్డావా తల్లీ అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు మరికొందరు.
ఇక మరొకరు అయితే ఈ పాటకి రిపోర్ట్ కొట్టాలి అని కామెంట్ చేస్తే మరొకరు ఇంకేం సాయి బాబా ,హనుమాన్ ,శివయ్య ఇలా అందరి మీద కూడా పాటలు చేసేయ్ అంటూ సెటైర్ వేశారు మరొకరు.
also read:అప్పుడు గాజులు గలగల.. ఇప్పుడు అయ్యప్ప మాల.. మళ్లీ వచ్చేసిందే!
పాటలు పాడటం ఆపుతుందో లేక మరిన్ని పాటలతో రచ్చ చేస్తుందో
మొత్తానికి ఈ మధ్య వేలం వెర్రిలా ఎలా పడితే అలా దేవుడిని రీల్స్ లోకి తీసుకొచ్చి ఇబ్బడిముబ్బడిగా ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా చేస్తున్నారన్నది నిజం.ఇక తాజాగా ఈ గజ్జెలు గజ్జెలు గజ్జెలు గల గల కూడా అదే బాటలో నడుస్తుందన్నది చాలా మంది వాదన.
చూడాలి మరి రాధమ్మ కూతురు ఇన్ని నెగెటివ్ ట్రోల్స్ ని చూసి ఇలా పాటలు పాడటం ఆపుతుందో లేక మరిన్ని పాటలతో రచ్చ చేస్తుందో కాలమే డిసైడ్ చేయాలి !