Rohit Naidu: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రచారం అవుతూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్టార్ మా లో ఆదివారం విత్ స్టార్ మా పరివారం(aadivaaram with star maa parivaram) అనే కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి (Sreemukhi) యాంకర్ గా వ్యవహరించగా ప్రతి వారం బుల్లితెర నటీనటులు పాల్గొంటూ సందడి చేస్తున్నారు ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈ వారం అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్10 (Bigg Boss 10 Telugu)లోకి ఎంపిక అయిన కంటెస్టెంట్లు పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా అవినాష్ మాట్లాడుతూ వీరందరినీ ఈ ఎపిసోడ్ కోసం హౌస్ నుంచి బయటకు తీసుకు వచ్చినట్టు ఉంది అంటూ కామెంట్లు చేశారు. ఇక శ్రీముఖి మాట్లాడుతూ శాలిని(shalini)తో రిలేషన్ గురించి రోహిత్ నాయుడు(Rohit Naidu)ని ప్రశ్నించగా రోహిత్ మొదటిసారి శాలినితో రిలేషన్ గురించి మాట్లాడుతూ.. మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపారు. ఇక ఎప్పటికీ మా మధ్య ఉన్న ఈ బంధం ఇలాగే కొనసాగుతుందని రోహిత్ నాయుడు తెలియచేశారు.
ఇలా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందంటూ ఎప్పటికీ మా ఫ్రెండ్ షిప్ ఇలాగే కొనసాగుతుందని ఈయన చెప్పడంతో షాలిని ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక అయి కామన్ మ్యాన్ క్యాటగిరిలో అడుగుపెట్టిన వారిలో రోహిత్ నాయుడు, శాలిని ఒకరు. ఇక వీరిద్దరూ హౌస్ లో చాలా చనువుగా ఉండడంతో ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని అందరూ భావించారు. ఇక హౌస్లో కొనసాగుతున్న సమయంలో నువ్వు లేక నేనులేను అనే రేంజ్ లో వీరిద్దరి మధ్య బాండింగ్ ఉండడంతో కచ్చితంగా వీరిద్దరూ లవ్ లో ఉన్నారని ప్రేక్షకులు కూడా భావించారు.
AgniparikshA 2 Success Party 👁️🔥
Agnipariksha Gang Is Back with a Bang!😎
Get Ready for Unforgettable Moments & Unlimited Entertainment! ⭐️Watch #AdivaramWithStarMaaParivaram Sunday at 11 AM only on #StarMaa#StarMaaPromo pic.twitter.com/04vFwJbRX5
— Starmaa (@StarMaa) November 24, 2026
ఇకపోతే ఊహించని విధంగా శాలిని ఏడవ వారం హౌస్ నుంచి బయటకు రాగా రోహిత్ ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇలా బయటకు వచ్చిన వీరిద్దరూ తమ మధ్య ఉన్న రిలేషన్ కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెబుతూ వచ్చారు. ఇక బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత వీరిద్దరూ పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన కామనర్స్ అందరూ కూడా శ్రీముఖి షోలో పాల్గొని సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.
Also Read: నీ కష్టానికి ఫలితం దక్కబోతోంది… నాగచైతన్యకు కార్తీక్ వర్మ ఎమోషనల్ బర్త్ డే విషెస్