Big Stories

MS Dhoni Stunning Catch IPL 2024: వారెవ్వా.. ధోనీ స్టన్నింగ్ క్యాచ్‌.. ఏ మాత్రం పస తగ్గలేదొంటున్న ఫ్యాన్స్..!

MS Dhoni

- Advertisement -

MS Dhoni Stunning Catch in CSK Vs GT Match IPL 2024: మహేంద్ర సింగ్ ధోనీ వయసు 42 ఏళ్లు.. 2004లో జాతీయ జట్టులో వన్డే మ్యాచ్ ఆడాడు. క్రికెట్ కెరీర్ ప్రారంభించి ఇప్పటికి సరిగ్గా 20 ఏళ్లయ్యింది. 2019లో జాతీయ జట్టుకి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత క్రికెట్ కెప్టెన్ గా ఎనలేని సేవ చేశాడు. అలాంటి ధోనీ ఐపీఎల్ లో ఇంకా ఆడుతూనే ఉన్నాడు.
ఇదంతా ఇప్పుడెందుకు..? తన గురించి అంతా తెలిసిందే కదాని అనుకుంటారు.

- Advertisement -

కానీ తను గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పట్టిన క్యాచ్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
స్లిప్ లో చిరుతపులిలా, ఆ బాల్ పై లంఘించిన తీరుచూసి క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
కుర్రాళ్లు ధోనీని చూసి నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని అంటున్నారు.

విషయం ఏమిటంటే.. గుజరాత్‌ టైటాన్స్ బ్యాటింగ్ లో ఉన్నారు. ఎనిమిదో ఓవర్‌ జరుగుతోంది. చెన్నైయ్ బౌలర్ డారిల్‌ మిచెల్‌ మూడో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. స్ట్రయికింగ్ లో ఉన్న బ్యాటర్ విజయ్‌ శంకర్‌ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ వైపు వెళ్లింది. బంతి గమనాన్ని, బ్యాటర్ ఆడే విధానాన్ని ముందే పసిగట్టే కీపర్ గా ధోనీకి అపారమైన నాలెడ్జ్ ఉంది.

Also Read: గుజరాత్ టైటాన్స్ చిత్తు.. చెన్నై ఘనవిజయం..

ఆ బాల్ అలా వచ్చిందంటే, బ్యాటర్ ఇలాగే ఆడుతాడని ధోనీ మైండ్ లో ఒక ప్రోగ్రాం ఫిక్స్ అయి ఉంటుంది. అంతే బాల్ అలా బ్యాట్ ని టచ్ చేసిన మరుక్షణమే తనకి అల్లంత దూరంలో ఉన్న బాల్ పై చిరుతలా లంఘించాడు. ఒడుపుగా ఒక్క ఉదుటున పట్టేశాడు. గ్రౌండ్ లో దెబ్బతగలకుండా పల్టీ కొట్టాడు. అంతే విజయ్ శంకర్ అవుట్ అయి పెవిలియన్ చేరాడు.

ధోనీ కీపర్ గా ఉన్నాడంటే, బ్యాటర్లు వళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సిందేననే సంగతి మరోసారి రుజువైంది. మొత్తానికి గుజరాత్ టైటాన్స్‌ను 63 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది, 42 ఏళ్ల వయసులో కూడా ధోని వేగం చూసి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. టీమిండియాకి ధోనీ ఇంకా ఆడితే బాగుండునని కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News