Karnataka on Education: ఈ మధ్యకాలంలో చిన్నారులపై లైంగిక కేసులు ఇబ్బందిముబ్బడిగా పెరుగుతున్నాయి. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. కాకపోతే ట్రెండ్ కు తగ్గట్టుగా అడుగులు వేయకుంటే ఇబ్బందులు తప్పవంటున్నారు. అందుకే చిన్నారులకు కనీసం 12 ఏళ్ల నుంచి ఏకాంతం పాఠాలు నేర్పించాలని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఆ దిశగా కర్ణాటక అడుగులు వేస్తోంది.
కర్ణాటక కొత్త ఆలోచన
తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో విద్యాసంస్థల్లో కీలక మార్పులు చేయనుంది. కొంత వయస్సు వచ్చిన పిల్లలకు శృంగార పాఠాలు సబ్జెక్ట్ పెట్టాలని ఆలోచన చేస్తోంది. 8వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ తరహా సబ్జెక్ట్‌ను అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ మంత్రి మధు బంగారప్ప శాసన మండలిలో ఓ ప్రకటన చేశారు.
కౌమర దశలో ఉన్నప్పుడు శారీరక, భావోద్వేగ, హార్మోన్ల మార్పుల గురించి టీనేజర్లకు విస్తృత అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వారంలో రెండుసార్లు వైద్య నిపుణులు ఈ ప్రొగ్రాంను నిర్వహిస్తారు. ఏడాదికి రెండుసార్లు మెడికల్ చెకప్, కౌన్సెలింగ్ సెషన్స్ ఉండనున్నాయి. విద్యార్థులకు పరిశుభ్రత, అంటువ్యాధులు, డ్రగ్ వల్ల కలిగే నష్టాలు వాటిపై ఆరోగ్య కేంద్రం సిబ్బంది అవగాహన కల్పించనున్నారు.
కర్ణాటక ప్రభుత్వం శృంగారం ఎడ్యుకేషన్‌తో పాటు సైబర్ హైజీన్ క్లాసెస్ నిర్వహించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. డిజిటల్ అడిక్షన్, ప్రీమెచ్యూర్ యాక్టివిటీ, టీనెజ్ గర్భాలు వాటికి సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఈ క్లాసెస్‌ను చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ క్లాసులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అనేదానిపై సంబంధిత అధికారులను నుంచి క్లారిటీ రావాల్సివుంది.
ALSO READ: హైకోర్టు జడ్డి ఇంట్లో అగ్నిప్రమాదం భారీగా నగదు లభ్యం
గతంలో ప్రయోగం విఫలం
దేశంలో అనేక రాష్ట్రాల్లో లైంగిక విద్య తరగతులు నిషేధం. అలాంటి తరగతులను ప్రవేశపెట్టలేదు. కర్ణాటక పాఠశాలల్లో లైంగిక విద్య చాలా కాలంగా వివాదాస్పద అంశంగా ఉంది. 2011లో యునిసెఫ్-బాలల హక్కుల సంఘాల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఎయిడ్స్ వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించింది. అలాంటి విద్య స్టూడెంట్స్‌కు తగదని అధికారులు వాదించారు.
2007లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్-NCERT కౌమార విద్యా కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది, యుక్త వయస్సు, లైంగిక ఆరోగ్యం, నివారణ సంబంధిత అంశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం దీని ఉద్దేశ్యం. అయితే తల్లిదండ్రులు, కొన్ని సంఘాలు, రాజకీయ నాయకుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఆ తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గోవా సహా అనేక రాష్ట్రాలు పాఠశాలల్లో లైంగిక విద్యను నిషేధించాయి. చివరకు లైంగిక విద్య మాడ్యూల్‌ను పాఠశాలల నుండి ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఇప్పుడు కర్ణాటక తీసుకురానుండడంతో ఇంకెన్ని అభ్యంతరాలు వస్తాయో చూడాలి.
పోక్సో చట్టంపై అవగాహన
అలాగే చిన్నారుల భద్రతపై అవగాహన పెంచేందుకు పోలీసులు విద్యార్థులకు పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించనున్నారు. దీనిపై ప్రత్యేక సెషన్ ఉన్నప్పటికీ విద్యార్థులకు తమ హక్కులు, చట్టపరమైన భద్రత గురించి మరింత మెరుగ్గా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అధికారులే చెబుతున్నారు.
దీనికితోడు నైతిక విద్యను ప్రతి పాఠశాలలో సబ్జెక్ట్ తప్పనిసరి కానుంది. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ సబ్జెక్ట్ ఉండనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతివారం రెండుసార్లు సెషన్స్ నిర్వహించనుంది. అందులో నిజాయితి, సహనం, సత్యాలు చెప్పడం లాంటి విలువలు నేర్పించనున్నారు.