Balakrishna : బెట్టింగ్ యాప్స్ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో విష్ణు ప్రియ (Vishnu Priya), రీతూ చౌదరి (Ritu chaudhary) లాంటి ఇన్ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రానా దగ్గుబాటి (Rana Daggubati) లాంటి స్టార్ హీరోలు సైతం ఈ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంలో బాలయ్య (Nandamuri Balakrishna) పేరు విన్పిస్తోంది. బాలయ్య ఈ యాప్స్ ను ప్రమోట్ చేయలేదు. కానీ ఆయన చేసిన ఓ షోలో వచ్చిన బెట్టింగ్ యాప్ యాడ్ ను చూసే బెట్టింగ్ స్టార్ట్ చేశానని వాపోతున్నాడు ఓ బాధితుడు. ఆయన ఎవరు? బాలయ్య చేసిన ఏ షోలో యాడ్ చూసి 80 లక్షలు నష్టపోయాడు ? అనే వివరాల్లోకి వెళ్తే…
బాలయ్య షో వల్ల 80 లక్షలు నష్టం
నెల్లూరుకు చెందిన బెట్టింగ్ బాధితుడు శ్రీరామ్ మాట్లాడుతూ “బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్స్టాపబుల్’ షోలో వచ్చే ఒక ప్రకటన చూసి బెట్టింగ్ పెట్టడం మొదలు పెట్టాను. బంగారం తాకట్టు పెట్టి, అప్పు తెచ్చి రూ.80 లక్షలు బెట్టింగ్ లో పెడితే మొత్తం నష్టపోయాను. మొదట్లో లాభాలు ఆశ చూపి, ఆ తర్వాత వాళ్ల ఊబిలోకి లాగుతున్నారు. కొన్ని రోజుల తర్వాత బెట్టింగ్ వ్యసనంగా మారి బానిస అయిపోతారు. నష్టపోతున్నాం అని తెలిసినా ఇంకా పెడుతూనే ఉంటారు. నేను అలా రూ.80 లక్షలు నష్టపోయి, ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. బెట్టింగ్ ప్రమోటర్లు, బెట్టింగ్ యాప్ ప్రకటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. యూత్ ఈ బెట్టింగ్ లకు దూరంగా ఉంటేనే మంచిది” అంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు.
తప్పు కాదంటున్న సెలబ్రిటీలు
ఇదిలా ఉండగా మరో వైపు దగ్గుబాటి రానా స్కిల్ బేస్డ గేమ్స్ కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారని ఆయన టీం సమర్ధిస్తోంది. అంతేకాకుండా 2017 లోనే ఈ డీల్ పూర్తయిందని, చట్టబద్ధంగా అనుమతి ఉన్న గేమ్స్ నిర్వహిస్తున్న వాళ్ళతోనే రానా అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పుకొచ్చింది రానా టీం. అలాగే విజయ్ దేవరకొండ టీం కూడా ఇదే విధంగా స్పందించింది. మరో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా బెట్టింగ్ యాప్స్ కేసులో వినిపించింది. ఆయన 2016లో ఒక గేమింగ్ యాప్ కు పబ్లిసిటీ చేశానని ఒప్పుకున్నారు. అయితే కొన్ని నెలల తర్వాత అది ఇల్లీగల్ అని తెలిసి కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాను అని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్ కు సెలెబ్రెటీల ప్రమోషన్స్ అనే వ్యవహారం పై తీవ్రంగా చర్చ నడుస్తోంది. బిగ్ స్క్రీన్ సెలబ్రిటీల పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు ఇందులో చిక్కుకున్న స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. వరుసగా కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘అన్ స్టపయబుల్’ షోలో యాడ్ కారణంగా బాలయ్య పేరు ఇందులో విన్పిస్తుండడంతో, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.
బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో వచ్చే ఒక ప్రకటన చూసి బెట్టింగ్ పెట్టడం మొదలు పెట్టాను : బెట్టింగ్ బాధితుడు
బంగారం తాకట్టు పెట్టి, అప్పు తెచ్చి రూ.80 లక్షలు బెట్టింగ్ లో పెడితే మొత్తం నష్టపోయాను
మొదట్లో మనకు లాభాలు చూపి ఆ తర్వాత వాళ్ల ఊబిలోకి లాగుతారు
కొన్ని రోజుల తర్వాత… pic.twitter.com/tjdC9BjDko
— BIG TV Breaking News (@bigtvtelugu) March 21, 2025