E-Paper
Advertisement

పిచ్చెక్కించే 4K విజువల్స్..ఈ ప్రొజెక్టర్‌తో లివింగ్ రూమ్‌ని థియేటర్ చేసెయండి!

పిచ్చెక్కించే 4K విజువల్స్..ఈ ప్రొజెక్టర్‌తో లివింగ్ రూమ్‌ని థియేటర్ చేసెయండి!
Advertisement

XGIMI Horizon 20 Pro: స్మార్ట్‌ ఫోన్‌లు, స్మార్ట్ టీవీల ట్రెండ్ మారుతున్న కొద్దీ.. హోమ్ ఎంటర్‌ టైన్‌మెంట్ కేటగిరీలో ప్రొజెక్టర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా.. పెద్ద స్క్రీన్‌పై సినిమా చూసే మజాను కోరుకునేవారి కోసం కంపెనీలు అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో డివైజెస్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ కోవకే చెందిందే ఈ మోడల్. యూజర్లకు బెస్ట్ ఫీచర్లనిచ్చే హై-ఎండ్ గాడ్జెట్స్  ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఈ లేటెస్ట్ ప్రొజెక్టర్ గురించి టెక్ మార్కెట్‌లో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. దీని స్పెసిఫికేషన్స్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. దీని గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ట్రిపుల్ లేజర్ టెక్నాలజీ, పిక్చర్ క్వాలిటీ:

ఈ ప్రొజెక్టర్‌లో అత్యంత మెయిన్ అట్రాక్షన్ దీని RGB ట్రిపుల్ లేజర్ ఇంజిన్. ఇది సాధారణ ల్యాంప్ లేదా డ్యూయల్ లేజర్ ప్రొజెక్టర్ల కంటే.. చాలా రెట్లు మెరు గైన కలర్ అక్యూరసీని ఇస్తుంది. 4K అల్ట్రా హెచ్‌డీ రెజల్యూషన్‌తో.. వస్తుండటం వల్ల స్క్రీన్ ఎంత పెద్దదిగా ఉన్నప్పటికీ పిక్సెల్స్ ఫాట్ అవ్వకుండా పిక్చర్ చాలా షార్ప్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే.. HDR సపోర్ట్ ఉండటం వల్ల చీకటి సీన్లలో కూడా డీటెయిల్స్ అద్భుతంగా వస్తాయి. పగటి పూట లేదా లైట్లు వేసుకున్న గదిలో కూడా బ్రైట్‌ నెస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బెస్ట్ విజువల్స్‌ను ఆస్వాదించవచ్చు.

స్మార్ట్ ఫీచర్లు, ఆడియో :

Advertisement

సినిమా చూసేటప్పుడు సౌండ్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మోడల్లో  పవర్‌ ఫుల్ బిల్ట్-ఇన్ స్పీకర్లను అందించారు. ఇవి డాల్బీ ఆడియో సపోర్ట్‌తో వస్తాయి కాబట్టి, వేరే హోమ్ థియేటర్ స్పీకర్లు అవసరం లేకుండానే.. థియేటర్ స్థాయి సరౌండ్ సౌండ్ ఫీల్ కలుగుతుంది. అంతే కాకుండా.. ఇందులో ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ కరెక్షన్ , ఇంటెలిజెంట్ స్క్రీన్ అలైన్‌మెంట్ వంటి లేటెస్ట్ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. గోడపై ఎక్కడ ప్రొజెక్ట్ చేసినా ఇది సెకన్లలో ఆటో మేటిక్‌గా స్క్రీన్‌ను పర్ఫెక్ట్ షేప్‌లోకి సెట్ చేసుకుంటుంది. గేమింగ్ లవర్స్ కోసం తక్కువ లేటెన్సీ మోడ్ కూడా ఇవ్వడం విశేషం.

Also Read: ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్‌ మెయిల్ ఫీచర్..యాక్టివేట్ చేసుకోండిలా

ధరల వివరాలు :

Advertisement

ఇలాంటి ప్రీమియం ఫీచర్లు కలిగిన హై-ఎండ్ హోమ్ థియేటర్ ప్రొజెక్టర్.. ధర కాస్త ఎక్కువే.. ఉంటుంది. గ్లోబల్ మార్కెట్‌లో.. ఈ మోడల్ ధర సుమారుగా రూ.1,80,000 నుంచి.. రూ.2,30,000 రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. లగ్జరీ హోమ్ థియేటర్ సెటప్ ఏర్పాటు చేసుకోవాలనుకునే.. వారికి ఇది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పొచ్చు.

మీ ఇంట్లోనే లగ్జరీ సినిమా హాల్ ఫీల్ సొంతం చేసుకోవాలనుకుంటే.. ఈ మోడల్ ఒక అద్భుత మైన ఛాయిస్. ట్రెండీ ఫీచర్లు, అదిరి పోయే లుక్‌తో ఇది టెక్ మార్కెట్‌లో నంబర్ వన్ ప్రొజెక్టర్‌గా నిలుస్తోంది.

Also Read: బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్.. నాయిస్ నుంచి అదిరిపోయే ఉమెన్స్ స్మార్ట్‌వాచ్!

Related News

ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్‌ మెయిల్ ఫీచర్..యాక్టివేట్ చేసుకోండిలా

బడ్జెట్‌లో HP కొత్త ల్యాప్‌టాప్.. ఇంటెల్ పాంథర్ లేక్ ప్రాసెసర్‌తో అదిరే స్పెసిఫికేషన్స్!

7900mah బ్యాటరీతో వచ్చిన POCO M8X 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్!

DSLR కెమెరాలకు గట్టిపోటీ ఇవ్వనున్న iQOO 16.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

ఒప్పో ఫైండ్ N6 vs మోటరోలా రేజర్ ఫోల్డ్.. ఈ రెండింటిలో ఫీచర్లు, కెమెరా, డిజైన్ పరంగా ఏది బెటర్?

అన్ని అకౌంట్లకూ ఒకే పాస్‌వర్డ్ వాడేస్తున్నారా? జాగ్రత్త

ఫోన్‌లో..కనిపించే ఈ 5 వార్నింగ్ సిగ్నల్స్ మీకు తెలుసా?

Big Stories

Advertisement
×