Big Stories

Kerala Governor : గవర్నర్‌ను ఛాన్స్‌లర్ పదవి నుంచి తొలగించిన కేరళ ప్రభుత్వం..

Kerala Governor : ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో గవర్నర్లకు, అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రగడ మొదలైంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను కేరళ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ పదవి నుంచి తొలగిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య ఇప్పుడు కేరళలోనే కాక మొత్తం దేశంలో రాజకీయ దుమారం రేపింది. కేరళ ప్రభుత్వానికి..గవర్నర్ రాజ్‌ ఆరిఫ్ సమాంతర మరో ప్రభుత్వాన్ని నడిపేలా వ్యవహరిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం మండిపడింది. అందుకే కేరళ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ పదవినుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవిని తొలగించాలంటూ డీఎంకె పార్టీ నేతలు రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాసారు. ఇటు తెలంగాణలో గవర్నర్ తమిళసైకు సీఎం కేసీఆర్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. నా ఫోన్ ట్యాప్ అవుతోందంటూ గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్య రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేంది. కేరళలో 11 యూనివర్సిటీల ఉపకులపతులు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫి మొహమ్మద్ లేఖ రాసారు. దీనిపై పినరయ్ విజయన్ భగ్గుమంటూ.. రాష్ట్ర గవర్నర్‌కు లాంటి ఆదేశాలిచ్చే హక్కులు ఏమీ లేవని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News