పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పట్ల భారత్ లోని అణువణువూ కోపంతో రగిలిపోతోంది. ఆపరేషన్ సిందూర్ తో ఆ ఆగ్రహం కాస్త చల్లారినా.. పాక్ కి గట్టి బుద్ధి చెప్పనిదే తమ కోపం చల్లారదని భారతీయులంతా ప్రతిజ్ఞపూనిన సందర్భం. కేవలం భారత్ లోనే కాదు, విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా పాకిస్తాన్ ని బాయ్ కాట్ చేశారు. పాక్ కి సాయం చేసిందన్న కారణంతో టర్కీని కూడా బ్యాన్ చేశాం. అలాంటిది పాకిస్తాన్ కి చెందిన మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కేరళకు చెందిన కొందరు వ్యక్తులు ఘన స్వాగతం పలకడాన్ని ఎలా చూడాలి..? ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యంపై నోరు పారేసుకున్న అఫ్రిది.. సిగ్గులేకుండా కేరళ వంటకాల్ని రుచి చూసి ఆహో ఓహో అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.
దుబాయ్ లో నివశిస్తున్న కేరళ వ్యక్తులు కొందరు ఇటీవల ఓ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని ముఖ్య అతిధిగా పిలిచారు. అంతే కాదు, అతడికి రాచమర్యాదలు చేశారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సందర్భంలో అఫ్రిదిని పిలవడమే పెద్ద తప్పు, అలా పిలిచి రాచమర్యాదలు చేసి, అతడికి కేరళ ఆహారాన్ని అందించి పక్కన నిలబడి ఫొటోలు దిగడం మరీ తప్పు. అందుకే ఆ కేరళ వ్యక్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు. దుబాయ్ లోని కేరళ సొసైటీని నెటిజన్లు తప్పుబడుతూ పోస్టింగ్ లు పెడుతున్నారు.
Kyuuu huaa aisaa. Sabse phle to Kerala ki government se punchanaa chahiye… Why? In jahiloooo ko bulane ki kya jarurat hai…
— 𝐂𝐚𝐫𝐩𝐞𝐝𝐢𝐞𝐦 (@the_carpdiem1) May 30, 2025
షాహిద్ అఫ్రిది కేవలం పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మాత్రమే కాదు, భారత్ అంటే అతడికి విపరీతమైన ద్వేషం ఉంది. భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ ల సందర్భంలో చాలా సార్లు ఈ విషయం బయటపడింది. ఇటీవల ఆపేరషన్ సిందూర్ సమయంలో కూడా అఫ్రిది నోరుపారేసుకున్నారు. అసలు పహల్గాం దాడి జరగడానికి కారణం భారత సైన్యమేనని విమర్శించారు అఫ్రిది. భారత్ కు 8 లక్షల మంది సైన్యం ఉందని, ఆ సైన్యం కాశ్మీర్ కు కాపలాగా ఉందని, అయినా కూడా ఇలాంటి సంఘటన జరిగింది అంటే.. దాని అర్థం భారత సైన్యం వారి ప్రజలకు తగినంత భద్రత ఇవ్వడంలేదని విమర్శించారు అఫ్రిది. ఉగ్రమూకల్ని పెంచి పోషిస్తూ భారత్ పై ఉసిగొల్పి భయోత్పాతాలు సృష్టిస్తున్న పాకిస్తాన్ కి పూర్తి మద్దతుగా మాట్లాడారు అఫ్రిది. ఉగ్ర దాడులను ఖండించాల్సింది పోయి, బాధితులైన భారతీయుల్ని దూషించారు. ఆ వ్యాఖ్యల తర్వాత అఫ్రిదిని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకున్నారు నెటిజన్లు.
Shahid Afridi called indian army incompetent and ineffective.
He said:
You have deployed 8 lac troops in IO Kashmir,
yet this incident still occurred.
This shows your army and intelligence agencies have failed.
Don't blame Pakistan.
Blame your own security agencies. pic.twitter.com/GsJEdou0m6— ЅᏦᎽ (@13hamdard) April 27, 2025
షాహిద్ అఫ్రిది ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు. ఉగ్రవాదులకు సపోర్ట్ గా మాట్లాడిన ఆ దుర్మార్గుడికి కేరళ వ్యక్తులు స్వాగతం పలకడమేందని నెటిజన్లు మండిపడుతున్నారు. భారత సైన్యాన్ని అవమానించిన వ్యక్తిని ముఖ్య అతిథిగా పిలిచి భారత్ పరువు తీశారంటూ విమర్శిస్తున్నారు. కేరళ సొసైటీ చేసింది ముమ్మాటికీ తప్పేనని నెటిజన్లు కౌంటర్లిస్తున్నారు. దేశానికి మీరు మంచి ఏదీ చేయకపోయినా పర్లేదు, ఇలాంటి తప్పుడు పనులు చేసి భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కాస్త గట్టిగానే గడ్డిపెడుతున్నారు.