BigTV English

R.Narayana Murthy: పవన్ నువ్వు తప్పు చేశావు.. థియేటర్స్ బంద్‌పై ఆర్.నారాయణ మూర్తి వైరల్ కామెంట్స్!

R.Narayana Murthy: పవన్ నువ్వు తప్పు చేశావు.. థియేటర్స్ బంద్‌పై ఆర్.నారాయణ మూర్తి వైరల్ కామెంట్స్!

R.Narayana Murthy:సినిమా ఇండస్ట్రీలో తాజాగా సినిమా థియేటర్ల రన్ విషయంపై నెలకొన్న పరిణామాలపై.. సీనియర్ నటులు ఆర్. నారాయణమూర్తి (R.Narayana Murthy) ప్రెస్ మీట్ నిర్వహించి మరీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రముఖ సినీనటులు, ఆంధ్రప్రదేశ్ డీసీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపడుతూ.. తనదైన శైలిలో కామెంట్లు చేశారు. తాజాగా గద్దర్ అవార్డులు 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆర్.నారాయణమూర్తి ప్రెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ..” గద్దర్ అవార్డులను ప్రకటించడం చాలా గర్వంగా ఉంది. ఈ గద్దర్ అవార్డ్స్ సొంతం చేసుకున్న విజేతలు అందరికీ కూడా నా అభినందనలు. తెలంగాణలో ఎలా అయితే గద్దర్ అవార్డ్స్ ప్రకటించారో.. ఇప్పుడు ఏపీలో కూడా సీఎం చంద్రబాబు (CM Chandrababu) నంది అవార్డులను ప్రకటించాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.


పవన్ నీ నిర్ణయం తప్పు – ఆర్.నారాయణమూర్తి..

ఇక అలాగే సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై కూడా స్పందిస్తూ.. “ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలి అని ఏపీ డిప్యూటీ సీఎం అనడంలో తప్పులేదు. ఆయన చేసిన ప్రకటన సరికాదు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాపై కుట్రలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పై ఎవరు కుట్ర పన్నగలరు. అటు థియేటర్ల బందు అనే విషయాన్ని కూడా ఎవరు ప్రకటించలేదు. దీనిపై పవన్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకటన, ఏపీ మంత్రి కందుల దుర్గేష్ మాటలు సరికాదు అంటూ ఆయన తెలిపారు. హరిహర వీరమల్లు సినిమా కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది పచ్చి అబద్ధం. పర్సంటేజీ ఖరారు అయితే నాలాంటి నిర్మాతలకు కూడా ఎంతో మేలు చేకూరుతుంది. బంద్ అనేది ఒక బ్రహ్మస్త్రం. సింగిల్ థియేటర్ల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్ధకరమైంది. పర్సంటేజీ విధానాన్ని కోరుకునే వ్యక్తులలో నేను కూడా ఒకడిని . ఈ విషయంలో ఫిలిం ఛాంబర్ ముందు టెంట్ వేసి ఆందోళన చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎంతోమంది చాంబర్ ప్రెసిడెంట్ లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు.ఇప్పుడు పర్సంటేజీ విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లు కి లింకు పెట్టడం ఏమాత్రం సరికాదు. ముఖ్యంగా ఈ విషయాన్ని పక్క దారి పట్టించవద్దు. పర్సంటేజ్ ని బతికించి నిర్మాతను కాపాడండి..” అంటూ తన నిర్ణయాన్ని చెప్పుకొచ్చారు ఆర్.నారాయణ మూర్తి.


టికెట్ ధరలు పెంచి ప్రేక్షకుడిని భయపెట్టొద్దు – ఆర్ నారాయణ మూర్తి

అలాగే టికెట్టు రేట్లు పెంపుపై కూడా ఆయన మాట్లాడుతూ.. సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ప్రేక్షకులే కాదు సినీ పరిశ్రమ కూడా నష్టపోతోంది. వినోదం అనేది ఖరీదుగా మారింది. భారీ ఖర్చుతో సినిమాలు తీయండి. కాదనలేదు కానీ ఆ ఖర్చును ప్రజలపై రుద్దకండి. హాలీవుడ్లో ఎన్నో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు. మన దగ్గర లవకుశ, షోలే లాంటి సినిమాలు కూడా భారీ బడ్జెట్లో వచ్చాయి. కానీ ఆ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమా బాగుంటే జనాలు వస్తారు. అప్పుడు పెంచని టికెట్ ధరలు ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు .టికెట్టు ధరలు పెంచడం వల్ల అభిమానులే కాదు ఇండస్ట్రీ కూడా నష్టపోతుంది.ముఖ్యంగా ఇలా టికెట్ ధరలు పెంచి అటు పాప్ కార్న్ ధరలు పెంచి ప్రేక్షకుడిని భయపెడుతున్నారు” అంటూ ఆర్.నారాయణ మూర్తి తన అభిప్రాయంగా వెల్లడించారు.

ALSO READ:Actress Devayani : దేవయాని కూతుర్ని చూశారా? హీరోయిన్ గా అందుకే అడుగు పెట్టలేదా?

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×