BigTV English

Delhi Crime News: ఢిల్లీలో దారుణం.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త..

Delhi Crime News: ఢిల్లీలో దారుణం.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త..
Delhi crime news
 

Woman burnt alive by husband in Delhi’s Rohini(Telugu breaking news today): దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాధితురాలి శరీరం పూర్తిగా కాలిపోయింది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మంటల్లో కాలిన మహిళను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు.


వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఓ ఇంట్లో మంటలు చెలరేగినట్లు, అక్కడ కొందరు మంటల్లో చిక్కుకున్నారని బేగంపూర్ పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్ కి కాల్ వచ్చిందని డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ జిఎస్ సిద్దూ తెలిపారు. వెంటనే పోలీస్ బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించి విషయం తెలుసుకున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ప్రమాద స్థలిని పరిశీలించగా ఆ ఇంటి మెయిన్ డోర్ లోపలి నుంచి లాక్ వేసి ఉండటాన్ని గుర్తించారు. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది ఘటానా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసారు.

Read more: భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో.. ప్రారంభించిన ప్రధాని మోదీ..


పోలీసులు ఆ ఇంట్లో తనిఖీ చేయగా తీవ్రంగా కాలిన ఒక మహిళ స్పృహ లేకుండా పడి ఉంది. ఆమెను వెంటనే ఆసుత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని, ఇద్దరు కుమార్తెలను మరొక ఆసుపత్రిలో చేరారు. అయితే అక్కడి నుంచి మరొక PCR కాల్ వచ్చింది.

పోలీసు బృందం వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తి మృతురాలి భర్త అని తెలుసుకున్నారు. మృతురాలి కుమార్తెలలో ఒకరు అక్కడ జరిగిన విషయం పోలీసులకు తెలిపింది. మా నాన్న ఎప్పుడు తాగుతూ ఉండేవాడని తన తల్లితో తరుచూ గొడవపడుతుంటాడని ఈ నేపథ్యంలో తన తల్లితో గొడపడి కిరోసిన్ పోసి నిప్పంటించాడని పేర్కొంది. నిందుతుడిపై ఐపీసీ 302 సెక్షన్ క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×