Matt Henry PSL Price: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందు నుంచి కుట్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రతిసారి ఐపీఎల్ షెడ్యూల్ సమయంలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తున్నారు. విదేశీ ప్లేయర్లను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే పీఎస్ఎల్ కూడా ఐపీఎల్ 2027 ప్రారంభం రోజే నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియాలో కుప్పకూలిచిన మాట్ హెన్రీపై (Matt Henry) కోట్లు కుమ్మరించి పాకిస్తాన్ సూపర్ లీగ్ కు ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు కొనుగోలు చేసింది. అతన్ని ఏకంగా 7.7 కోట్ల పాకిస్తానీ రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అంటు ఇది ఐపీఎల్ కంటే ఎక్కువ ధరే అన్న మాట.
టీమిండియాపై ఇటీవల అద్భుతంగా ప్రదర్శన కనబరిచిన మాట్ హెన్రీని (Matt Henry) ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇండియన్ రూపాయలలో అతని ధర రూ.2.38 కోట్లు. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తరఫున కూడా మాట్ హెన్రీ ఆడడం జరిగింది. ఐపీఎల్ లో అతను కేవలం రెండు కోట్లు మాత్రమే పలికాడు. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ 2026 సమయంలో కొనుగోలు చేసింది.
అంతకు ముందు జరిగిన సీజన్ లలో అన్ సోల్డ్ ప్లేయర్ గా మాట్ హెన్రీ మిగిలాడు. అయితే ఈ సారి రెండు టోర్నమెంట్లు ఒకేసారి వస్తున్న క్రమంలో ఐపీఎల్ కాకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు మాట్ హెన్రీ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అతన్ని రూ.2.36 కోట్లు ( PKR 7.07 crore ) పెట్టి ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు కొనుగోలు చేసింది. ఈ లెక్కన ఐపీఎల్ కంటే రూ.36 లక్షలు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మాట్ హెన్రీ సంపాదిస్తున్నాడు. ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
2027 ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్లు ఒకేసారి ప్రారంభం కానున్నాయి. PSL మార్చి 18వ తేదీన ప్రారంభం కానుండగా మే రెండో తేదీన ఫినిష్ అవుతుంది. ఐపీఎల్ మార్చి 10వ తేదీన షురూ కానుండగా.. మే 15వ తేదీ వరకు మొత్తం 74 మ్యాచులు జరుగుతాయి. రెండు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో విదేశీ క్రికెటర్లు ఏ టోర్నమెంట్ ఆడతారనేది హాట్ టాపిక్ అయింది.