BigTV English

PM Modi Youtube Channel : వ్యూస్ లోనే కాదు ఆదాయంలోనూ టాపే.. నెలకు ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ ఆదాయం ఎంతో తెలుసా..

PM Modi Youtube Channel : వ్యూస్ లోనే కాదు ఆదాయంలోనూ టాపే.. నెలకు ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ ఆదాయం ఎంతో తెలుసా..

PM Modi Youtube Channel : సోషల్ మీడియాలో ప్రధాని మోదీ చాలా చురుగ్గా ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేటి యువతరానికి దగ్గర కావడానికున్న మార్గాన్ని అయన లాంటి వ్యక్తులు అస్సలు మిస్ చేసుకోరు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి పీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత.. మోదీ వాడినట్లు సోషల్ మీడియాను ఎవరూ వాడలేదు అనుకోవచ్చు. మీడియా ఇంటర్వ్యూలకి, సమావేశాలకు దూరంగా ఉండే ప్రధాని మోదీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం యాక్టీవ్ గా ఉంటుంటారు. మరి.. మన ప్రధాని యూట్యూబ్ ఛానెల్ ప్రత్యేకతలు ఎంటో ఎప్పుడైనా ఆలోచించారా.? ఈ ఛానెల్ ద్వారా ఆయన నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా.? తెలియకపోతే.. ఈ స్టోరీ చదివేయండి.


భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెల్ వంటి వివిధ సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఆయన నిత్యం అందుబాటులో ఉంటూ ఉంటారు. తన ప్రోగ్రాములు, అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు సహా.. అన్ని కార్యక్రమాల్ని ఈ ఛానెళ్ల ద్వారా ప్రసారం చేస్తుంటారు. దాంతో.. ఆయనను ఆయా ఛానెళ్ల ద్వారా ఫాలో అయ్యే వాళ్లు చాలా మందే ఉన్నారు.

నరేంద్ర మోదీ అనే పేరుతో ఆయనకు అధికారిక యూట్యూబ్ ఛానెల్ ఒకటుంది. ఈ ఛానెల్ అక్టోబర్ 26, 2007న ప్రారంభించారు. అంటే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ప్రధాని అయిన తర్వాత పేరు మార్చారు. ఈ ఛానెల్ కు 26.5 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అంతర్జాతీయంగా యూట్యూబ్‌లో 20 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉన్న ఏకైక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. అంతే కాదు.. ఛానెల్ వ్యూస్, లైక్స్ ద్వారా భారీగానే సంపాదిస్తోంది.. ప్రధాని యూట్యూబ్ ఛానెల్.


యూట్యూబ్ ఛానెల్ స్ట్రీమింగ్ సమాచారాన్ని అందించిన ఓ వెబ్ సైట్ సమాచారం ప్రకారం.. ప్రధాని మోదీ అధికారిక ఛానెల్ కు నెలకు 1,89,000 డాలర్ల నుంచి 5,67,100 డాలర్ల మధ్య ఆదాయం వస్తుంది. అంటే.. మన భారత కరెన్సీలో రూ. 1 కోటీ 62 లక్షల నుంచి రూ. 4 కోట్ల 87 లక్షల మధ్యలో ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఛానెల్ లో ఇప్పటి వరకు 29,272 వీడియోలు అప్‌లోడ్ చేయగా.. 636 కోట్ల 33 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇలా.. రాజకీయ నేతల సోషల్ మీడియా రికార్డ్స్ లో.. మన ప్రధాని రికార్డ్సే ముందు వరుసలో ఉంటాయి మరి.

Also Read : దిల్లీ మద్యం పాలసీలో రూ.2,026 కోట్ల కుంభకోణం.. కాగ్ సంచలన రిపోర్ట్ వెల్లడి

ప్రధాని మోదీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన చాలా వీడియోలు 40 వేల కంటే ఎక్కువగానే వ్యూస్ సాధిస్తుంటాయి. అలాగే.. ఎక్కువ సబ్‌స్క్రైబర్లు, వ్యూస్ కారణంగా.. ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ భారీగానే ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ప్రతి వారం సగటున 19 వీడియోలు అప్‌లోడ్ చేస్తుండాగ.. ప్రధాని మోదీకి ఫేస్‌బుక్‌లో 48 మిలియన్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 82.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రధాని మోదీ తర్వాత… బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో 6.4 మిలియన్లతో యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌ల పరంగా రెండో ర్యాంకులో ఉన్నారు. కానీ.. మోదీ ఫాలోవర్లతో పోల్చితే..నాలుగో వంతు మాత్రమే.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×