E-Paper
Advertisement

ఆ కూలీ పంట పడింది.. లక్షలకు లక్షలు వచ్చిపడ్డాయి, ఏకంగా రూ. 40 లక్షల పైమాటే

ఆ కూలీ పంట పడింది.. లక్షలకు లక్షలు వచ్చిపడ్డాయి, ఏకంగా రూ. 40 లక్షల పైమాటే
Advertisement

Panna Mines: పట్టుదల, అదృష్టం కలిసి వస్తే ఏమైనా సాధించవచ్చు. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో రాకేష్ గోండ్ ఒకరు. రాత్రికి రాత్రి లక్షలు వచ్చిపడ్డాయి. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మటికీ నిజం. ఆయన హైక్వాలిటీ వజ్రం దొరికింది. దీంతో ఆ పేదోడి కష్టాలు తీరినట్టే. ఏంటి? ఎక్కడ అన్న డీటేల్స్‌లోకి వెళ్తే..

పన్నా గనుల్లో వజ్రాల పంట.. అరుదైన వజ్రాలు లభ్యం

Advertisement

అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో తెలీదు. రోజూ మట్టిని తవ్వుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ కూలీకి ఆ మట్టి లక్షల సంపదను తెచ్చిపెట్టింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాలోని అహిర్‌గువా గనుల్లో అరుదైన రత్నం లభించింది. దీంతో ఆ పేదోడి కష్టాలు తీరాయి.  11.19 క్యారెట్ల అరుదైన వజ్రం అది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అహిర్‌గువా ప్రాంతంలో 8 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు ఉన్న గనిని లీజుకు తీసుకున్నాడు.

ఆదివారం తన పని ముట్లతో మట్టిని జల్లిస్తుండగా తెల్లటి వజ్రం మెరుస్తోంది. అనుమానం వచ్చి ఇరుగుపొరుగు వారికి చూపించాడు. ఆ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. ప్రభుత్వ వజ్రాల ఆఫీసుకి వెళ్లి అది ఇచ్చాడు. అధికారులు-నిపుణులు దాన్ని పరిశీలించారు. నాణ్యత చాలా బాగుందని, బహిరంగ వేలంలో రూ.40 లక్షలు లేకుంటే అంతకంటే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

ఆ కూలీ పంట పడింది.. రూ. 40 లక్షల విలువ వజ్రం లభ్యం

దీంతో ఆ పేదోడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రాయల్టీ, పన్నులు మినహాయించిన ఆ మొత్తం రాకేశ్ కుటుంబానికి అందబోతోంది. గిరిజన కుటుంబానికి చెందిన రాకేశ్, వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాలని డిసైడ్ అయ్యాడు. వ్యవసాయ భూమి కొనుగోలు, కొత్త ఇంటిని నిర్మించాలని భావిస్తున్నాడు. పిల్లలకు మంచి విద్య అందించడమే తమ లక్ష్యమంటున్నాడు.

వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా. ఇటీవల కాలంలో అరుదైన వజ్రాలు అక్కడి వాళ్లకు దొరుకుతున్నాయి. జూన్ 18న మీరా సింగ్ అనే మహిళకు 6.45 క్యారెట్ల వజ్రం లభించింది. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 12 లక్షలు పలికింది.

ALSO READ: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో మహానగరం, స్తంభించిన ప్రజాజీవనం

మార్చిలో వజ్రాల గని లీజును తీసుకుని రాకేష్ సింగ్ తవ్వకాలు జరుపుతూ వచ్చాడు. అతడు కూడా విలువైన వజ్రాన్ని దక్కించుకుంటున్నాడు. మొత్తానికి పన్నా గనులు నెల లేదా రెండు నెలలకు ఒకసారి ఇలాంటి అరుదైన వజ్రాలు లభిస్తున్నాయి.

Related News

వాహనదారులకు బిగ్ షాక్.. ఇంటి ముందు పార్కింగ్‌ చేస్తే రూ.25 వేలు, కొత్త రూల్స్ ఎక్కడో తెలుసా?

ఉత్తరాఖండ్‌ సొరంగంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి, ఆరుగురు గల్లంతు, ఇంకా

ఎర్రకోట పేలుడు వెనుక ‘అల్ ఖైదా’.. ఐరాస భద్రతా మండలి సంచలన నివేదిక!

బస్సులో పోయిన రూ.24 వేలు.. 2 ఏళ్ల తర్వాత మళ్లీ చేతికొచ్చాయ్.. కండక్టర్ మామూలోడు కాదు సామీ!

జంతర్ మంతర్‌లో ఇక నిరసనలు బంద్? ఢిల్లీ సర్కార్, పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు!

రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్

స్టీరింగ్ గేర్ వైఫల్యం.. తీరానికి దూసుకొచ్చిన భారీ నౌక.. ఒడ్డున ఉన్నోళ్లు పరుగో పరుగు!

రేప్ కేసు.. 20 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల.. జీవితం నాశనం-తల్లిదండ్రులనూ కోల్పోయా..

Big Stories

Advertisement
×