Dhananjaya de Silva Warns Team India: టీమిండియా వర్సెస్ శ్రీలంక ( Sri Lanka vs India) మధ్య రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ( India tour of Sri Lanka 2026) ప్రారంభం కాబోతుంది. గాలే వేదికగా ( Galle International Stadium, Galle) ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ రేపు 10 గంటల సమయంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ క్రమంలో రెండు జట్లు ప్రాక్టీస్ చేస్తూ, నెట్స్ లో చెమటోడ్చుతున్నాయి.
అయితే రేపటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీమిండియాకు శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా (Dhananjaya de Silva) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీమిండియాతో జరిగే రెండు టెస్టులను కేవలం మూడు రోజుల్లోనే ముగిస్తామంటూ హెచ్చరించారు. ఐదు రోజుల వరకు టెస్ట్ జరగాల్సి ఉండగా.. తాము ముందుగా ఫినిష్ చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. తమ దెబ్బకు టీమిండియా ప్లేయర్లకు నిద్రలేకుండా పోతుందని స్ట్రాంగ్ బెల్స్ పంపించారు శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా. దీంతో శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
టీమిడియా వర్సెస్ శ్రీలంక మధ్య రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా (Dhananjaya de Silva) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో కెప్టెన్ గిల్ కంటే కేఎల్ రాహుల్ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేఎల్ రాహుల్ ఒక్కడిని అవుట్ చేస్తే.. టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అన్నారు. అతనికి శ్రీలంకపై ఆడిన అనుభవం ఉందని.. గతంలో కూడా రెండు అర్థ సెంచరీలు చేశాడని గుర్తు చేశారు ధనుంజయ డిసిల్వా. ఇలాంటి నేపథ్యంలో తమ టార్గెట్ కేవలం కేఎల్ రాహుల్ అంటూ వ్యాఖ్యానించారు. మిగిలిన టీమిండియా బ్యాటర్లను అవలీలగా పెవిలియన్ కు పంపించగల శక్తి తమకు ఉందని వ్యాఖ్యానించారు.
మొదటి టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ( Team India) క్రికెటర్లు అందరూ గాయాల బారిన పడ్డారని ఈ హేళన చేస్తూ శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా (Dhananjaya de Silva) షాకింగ్ కామెంట్స్ చేశారు. కీలకమైన ప్లేయర్ లందరూ టీమిండియా కు దూరంగా ఉన్నారని వివరించారు. వరుసగా టీమిండియా ప్లేయర్లు గాయపడడం తమకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీమిండియా కాస్త ఆసుపత్రి వార్డుగా మారిందని కూడా హేళన చేశారు. సాయి సుదర్శన్, బుమ్రా, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్లు గాయపడ్డారన్నారు.