Bank Holidays July 2026: జులై నెలలో బ్యాంకులకు భారీగా ఎత్తున సెలవులు ఉండనున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన అధికారిక సెలవుల జాబితా ప్రకారం.. జులైలో ఆదివారాలు, రెండో – నాల్గో శనివారాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పండుగలు, సాంస్కృతిక ఉత్సవాల కారణంగా బ్యాంకులకు సెలవులు రానున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి కాకుండా ఆయా ప్రాంతాల పండుగలను బట్టి ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. కాబట్టి జులైలో బ్యాంకుల తేదీలు, వాటికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రైవేటు, ప్రభుత్వ అన్నదానితో సంబంధం లేకుండా సాధారణంగా ప్రతీ బ్యాంక్ కు వారంతపు సెలవులు ఉంటాయి. ఇందులో భాగంగా జులై నెలలో 6 రోజుల పాటు బ్యాంకులకు వారంతపు సెలవులు ఉన్నాయి.
❄️ జులై 5: ఆదివారం
❄️ జులై 11: రెండో శనివారం
❄️ జులై 12: ఆదివారం
❄️ జులై 19: ఆదివారం
❄️ జులై 25: నాలుగో శనివారం
❄️ జులై 26: ఆదివారం
ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక దినోత్సవాల ఆధారంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఆర్ బీఐ సెలవులు మంజూరు చేసింది.
❄️ జులై 6 (సోమవారం): మిజోరాం రాష్ట్రంలో అతిపెద్ద మహిళా సంక్షేమ సంస్థ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.
❄️ జులై 9 (గురువారం): బెహ్ దీంఖ్లామ్ (Beh Deinkhlam) పండుగ సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు హాలీడే.
❄️ జులై 16 (గురువారం): జగన్నాథ రథయాత్ర, హరేలా పండుగలను పురస్కరించుకొని ఒడిశా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు ఆ రోజు సెలవు.
❄️ జులై 17 (శుక్రవారం): మేఘాలయ స్వాతంత్ర సమరయోధుడు యు తిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సెలవు.
❄️ జులై 18 (శనివారం): బౌద్దుల పవిత్ర పండుగ ద్రుక్పా త్షె-జి (Drukpa Tshe-zi) సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు హాలీడే.
❄️ జులై22 (బుధవారం): ఖర్జీ పూజ సందర్భంగా త్రిపుర రాష్ట్రంలోని బ్యాంకులు మూతపడనున్నాయి.
ఏపీ, తెలంగాణలోని బ్యాంకుల సెలవులు విషయానికి వస్తే.. జులై నెలలో ప్రత్యేకంగా ఎలాంటి బ్యాంక్ హాలీడేస్ లేవు. ఎలాంటి ప్రత్యేక ప్రాంతీయ సెలవులను ప్రభుత్వాలు, ఆర్ బీఐ ప్రకటించలేదు. కేవలం వారాంతపు సెలవులు (ఆదివారాలు, 2వ 4వ శనివారాలు) మాత్రమే బ్యాంకులు మూత పడనున్నాయి.
Also Read: ఏసీ మనుషుల కోసం కనిపెట్టింది కాదా? హిస్టరీ తెలిస్తే ఫ్యూజులు ఎగరడం పక్కా!
సెలవు రోజుల్లో బ్యాంకులు మూతపడినప్పటికీ.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. నగదు బదిలీలు, అత్యవసర చెల్లింపులు ఉన్నవారు డిజిటల్ విధానాల ద్వారా పనులు పూర్తి చేసుకోవచ్చని సూచించాయి. కాబట్టి జులైలో ఖాతా ఉన్న లోకల్ బ్రాంచ్‌కు వెళ్లే ముందు ఈ సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేసుకొని బ్యాంక్ విజిట్ ను ప్లాన్ చేసుకుంటే మంచిదని నిపుణులు హితవు పలుకుతున్నారు.
Also Read: జులై 1 నుంచి పాత రూ.10, 20, 50, 100 నోట్ల రద్దు? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?