E-Paper
Advertisement

రేప్ కేసు.. 20 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల.. జీవితం నాశనం-తల్లిదండ్రులనూ కోల్పోయా..

రేప్ కేసు.. 20 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల.. జీవితం నాశనం-తల్లిదండ్రులనూ కోల్పోయా..
Advertisement

Agra Man: దేశంలో ఈ మధ్యకాలం విచిత్రమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఫలితంగా విలువైన జీవితాన్ని, అయినవారిని కోల్పోయిన సందర్భాలు బయటపడుతున్నాయి. అందుకు ఎగ్జాంఫుల్ ఆగ్రాకు చెందిన ఈ యువకుడు కథ. తప్పుడు రేప్‌ కేసులో రెండు దశాబ్దాలు జైలు జీవితం అనుభవించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై సమాజంలోని అన్నివర్గాలు పలు ప్రశ్నలు రైజ్ చేస్తున్నాయి.

 

ఆగ్రాలో ఓ యువకుడి రియల్ స్టోరీ

Advertisement

పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు విష్ణు తివారీ. అతడు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు అయినవారిని చూసి వెక్కివెక్కి ఏడ్చాడు. బయటకు రావడం అతనికి విజయమని అనిపించలేదు. ఎందుకంటే చేయని నేరానికి రెండు దశాబ్దాలు కటకటాల వెనుక గడిపాడు. బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా కోల్పోయాడు. తల్లిదండ్రులను కోల్పోయాడు. కుటుంబం విచ్ఛిన్నమైంది, చివరకు జీవితం నాశనం అయ్యింది. ఒకప్పుడు తెలిసిన ప్రపంచం ఇప్పుడు కనుమరుగైంది. జైలు నుండి బయటకు వస్తుండగా ఓ వ్యక్తి కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది. తప్పుడు అత్యాచార కేసులో 20 ఏళ్లు జైలులో గడిపాడు. చివరకు 2021లో హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడంతో విష్ణు తివారీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

20 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల

Advertisement

సరిగ్గా 2000వ ఏడాది సెప్టెంబర్‌ నెల అది. ఉత్తర ప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాకు చెందిన విష్ణుపై తప్పుడు అత్యాచారంలో ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నివారణ చట్టం కింద అరెస్టు అయ్యాడు. 2003లో కోర్టు అతడ్ని దోషిగా నిర్ధారించడంతో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అప్పటి నుంచి ఆగ్రా సెంట్రల్ జైలులో కాలం వెళ్లదీశాడు. అప్పటికి విష్ణు వయస్సు కేవలం 23 ఏళ్లు. ఒక్కసారి బెయిల్ మంజూరు కాకుండా జైలులో కాలం గడిపాడు. రెండు దశాబ్దాలపాటు జైలులో మగ్గిపోయాడు. జైళ్లలో రద్దీని తగ్గించడానికి చాలా మంది ఖైదీలను విడుదల చేశారు. కరోనా వైరస్ సమయంలో అతడికి పెరోల్ ఇవ్వలేదు. ఆ సమయంలో విష్ణు తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు మరణించారు. అతడి కుటుంబాన్ని సమాజం వెలివేసింది. ఉన్న ఐదు ఎకరాల భూమిని అమ్మేశారు.

 

జీవితం నాశనం-తల్లిదండ్రులనూ కోల్పోయాడు

జాతీయ కథనాల మేరకు.. కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు అతడ్ని అనుమతించలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను సంతోషంగా ఉన్నానని, కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదన్నాడు. ఇల్లు శిథిలమైపోయిందని, కుటుంబ సభ్యులు చనిపోయారని తెలిపాడు. నా విషయంలో దర్యాప్తు అధికారి తప్పుడు నివేదిక ఇచ్చారని వాపోయాడు. విష్ణు సమస్య విన్న నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం అతడికి భారీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన మహిళను జైలుకు పంపాలని కోరుతున్నారు. అతడి జీవితంలో 20 ఏళ్లు కోల్పోవడంతో ఆమెని 20 ఏళ్లు జైలులో పెట్టాలని అంటున్నారు. దేశంలో అమ్మాయిలతో పెట్టుకోకపోవడమే మంచిదని మరొకరు అన్నారు.

ALSO READ: జైలులో ప్రజ్వల్ రాజభోగాలకు చెక్.. ఫోన్‌లో 90 ఏకాంత వీడియోలు, షాకైన అధికారులు

Tags

Related News

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

LPUలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హాస్టల్‌లో లైంగిక దాడి ఆరోపణలు.. రణరంగంగా మారిన క్యాంపస్!

యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!

పబ్లిక్ టాయిలెట్ లో ఇద్దరు యువకుల శవాలు.. ఎవరు చంపారు?

కోయంబత్తూరు హైవేపై సినిమా తరహాలో.. హెడ్ కానిస్టేబుల్ సాహసం, ఏకంగా 40 కి.మీ ప్రయాణం

59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగం.. 27 ఏళ్ల సుదీర్ఘ పోరాటం

Big Stories

Advertisement
×