E-Paper
Advertisement

బస్సులో పోయిన రూ.24 వేలు.. 2 ఏళ్ల తర్వాత మళ్లీ చేతికొచ్చాయ్.. కండక్టర్ మామూలోడు కాదు సామీ!

బస్సులో పోయిన రూ.24 వేలు.. 2 ఏళ్ల తర్వాత మళ్లీ చేతికొచ్చాయ్.. కండక్టర్ మామూలోడు కాదు సామీ!
Advertisement

Honest Conductor: సాధారణంగా బస్సులో ఏ చిన్న వస్తువు మర్చిపోయినా.. ఇక అది దొరకదని చాలా మంది ఆశలు వదిలేసుకుంటారు. ఈ క్రమంలోనే ఓ వృద్ధురాలి సైతం రెండేళ్ల క్రితం రూ.24 వేల నగదు, కీలకమైన డాక్యుమెంట్లు ఉన్న బ్యాగ్ ను మర్చిపోయి.. ఇక అది చేతికి రాదని ఒక అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ఆ బస్సు కండక్టర్ చూపిన గొప్ప మనస్సు కారణంగా రెండేళ్ల తర్వాత కూడా ఆ బ్యాగు తిరిగి ఆమె వద్దకు చేరింది. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన మనుషుల్లో నీతి, నిజాయతీ ఇంకా బతికే ఉందని నిరూపిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..

2024లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి వాషిమ్ మార్గంలో ప్రయాణిస్తున్న కాసాబాయి గైక్వాడ్ అనే వృద్ధురాలు తన హ్యాండ్‌బ్యాగును బస్సులోనే మరచిపోయారు. ఆ బ్యాగులో రూ.24,000 నగదుతో పాటు ఆసుపత్రికి సంబంధించిన అత్యంత కీలకమైన మెడికల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే బస్సు దిగిన తర్వాత గానీ బ్యాగు పోయినట్లు ఆమెకు గుర్తురాలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఆ సొమ్ము ఇక తనకు దక్కదని కాసాబాయి ఆశలు వదులుకున్నారు.

కండక్టర్ నిజాయితీ.. ప్రతిరోజూ వెతుకులాట!

Advertisement

ఆ రోజు బస్సులో కాసాబాయి మరచిపోయిన బ్యాగును రాజు వాణీ అనే కండక్టర్ గమనించారు. దాన్ని చూడగానే ఏమాత్రం దురాశకు పోకుండా వెంటనే వాషిమ్ బస్సు డిపో యాజమాన్యానికి భద్రంగా అప్పగించారు. అయితే డిపోలో ఇచ్చినంత మాత్రాన తన బాధ్యత తీరిపోలేదని ఆయన భావించారు. ఆ బ్యాగు పొగొట్టుకున్నవారు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకుని గత రెండేళ్లుగా ప్రతిరోజూ బస్సులో వచ్చే ప్రయాణికులలో ఆ వృద్ధురాలి కోసం వెతకడం ప్రారంభించారు.

రెండేళ్ల తర్వాత అపూర్వ కలయిక!

ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత కాసాబాయి గైక్వాడ్ మళ్లీ అదే రూట్ బస్సులో ప్రయాణించారు. యాదృచ్ఛికంగా ఆ రోజు కూడా రాజు వాణీనే ఆ బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బస్సులో ఆమెను గుర్తుపట్టిన ఆయన.. వెంటనే పలకరించి రెండేళ్ల క్రితం ఆమె మరచిపోయిన బ్యాగు, నగదు డిపోలో భద్రంగా ఉన్నాయని చెప్పారు.

Advertisement

Also Read: రూ.30 వేల ఫోన్.. చైనాలో రూ.15 వేలే ఎందుకు? మనం ఎక్కువ ఇస్తున్నామా?

కంటతడి పెట్టిన వృద్ధురాలు

పోగొట్టుకున్న డబ్బులు, విలువైన పత్రాలు రెండేళ్ల తర్వాత తిరిగి రావడంతో కాసాబాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రూపాయి కోసం కక్కుర్తి పడే ఈ రోజుల్లో.. రూ.24 వేల నగదును రెండేళ్ల పాటు దాచి వెతికి మరీ ఇచ్చిన కండక్టర్ రాజు వాణీ నిజాయితీకి ఆమె మురిసిపోయారు. ఆయన పట్టుదలకు, నిబద్ధతకు మనసారా కృతజ్ఞతలు తెలుపారు. రూ. 1,100 నగదును బహుమతిగా అందించి తన నిండు హృదయంతో కండక్టర్ ను ఆశీర్వదించారు.

Also Read: హైదరాబాద్ – అమరావతి – చెన్నై బుల్లెట్ రైలు.. పరిశీలనలో 18 స్టేషన్లు.. ఇందులో మీ ఊరు ఉందా?

Tags

Related News

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

LPUలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హాస్టల్‌లో లైంగిక దాడి ఆరోపణలు.. రణరంగంగా మారిన క్యాంపస్!

యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!

పబ్లిక్ టాయిలెట్ లో ఇద్దరు యువకుల శవాలు.. ఎవరు చంపారు?

కోయంబత్తూరు హైవేపై సినిమా తరహాలో.. హెడ్ కానిస్టేబుల్ సాహసం, ఏకంగా 40 కి.మీ ప్రయాణం

59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగం.. 27 ఏళ్ల సుదీర్ఘ పోరాటం

ఢిల్లీలో చెంపదెబ్బ వీడియో కలకలం.. అసలు నిజం బయటపెట్టిన మంత్రి పర్వేష్ వర్మ!

Big Stories

Advertisement
×