E-Paper
Advertisement

ఉత్తరాఖండ్‌ సొరంగంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి, ఆరుగురు గల్లంతు, ఇంకా

ఉత్తరాఖండ్‌ సొరంగంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి, ఆరుగురు గల్లంతు, ఇంకా
Advertisement

Chamoli Tunnel Disaster: ఉత్తరాఖండ్‌లో చమోలీ జిల్లాలోని జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు మిస్సయ్యారు. మరో 14 మంది గాయపడ్డారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అసలు ఘటన ఎలా జరిగింది?

ఉత్తరాఖండ్‌ సొరంగంలో ఘోర ప్రమాదం

ఇటీవలకాలంలో ఉత్తరాదిలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎప్పుడు, ఎక్కడ ఏ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. గురువారం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలోకి ఒక్కసారి నీరు వచ్చేసింది. దాన్ని చూసి కార్మికులు అక్కడి నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనలో 7 కార్మికులు మృతువాతపడ్డారు. మరో ఆరుగురు జాడ కనిపించలేదు. మరో 11 మంది గాయపడ్డారు. గల్లంతైన కార్మికుల కోసం గాలింపు కొనసాగుతున్నాయి.

Advertisement

 

సొరంగంలోని నీరు ఎంట్రీ, భయాందోళనలో కార్మికులు

ప్రాథమిక నివేదికల ప్రకారం.. పిపల్‌కోటి ప్రాంతంలోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు సొరంగంలో ఘటన జరిగినప్పుడు పదుల సంఖ్యలో అక్కడ కార్మికులు ఉన్నారు. వారిలో 22 మందిని రక్షించారు. గాయపడిన కార్మికులు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ-హెచ్‌సిసి చేపడుతోంది. సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ బృందాలు ఇద్దర్ని గుర్తించాయి. సొరంగంలో చిక్కుకున్న ఓ కార్మికుడిని రక్షిస్తున్న దృశ్యాల వీడియో వెలుగులోకి వచ్చింది.

Advertisement

 

ఏడుగురు కార్మికులు మృతి, ఆరుగురు గల్లంతు, 14 మందికి గాయాలు

మరణించిన వారిలో ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, చమోలీలకు చెందిన ఒక్కొక్కరు కార్మికులు ఉన్నారు. మిగిలినవారు బీహార్, జార్ఖండ్‌లకు చెందినవారని తెలిపారు అధికారులు. గాయపడి కార్మికులలో ఎక్కువ మంది జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లకు చెందినవారు ఉన్నారు. సొరంగంలో నీరు, బురద పెరగడంతో సహాయక చర్యలను కొన్ని గంటలపాటు నిలిపివేశారు. ఈ ఘటన సాయంత్రం 6.30-6:45 గంటల మధ్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. పిపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో సుమారు 1.8 కిలోమీటర్ల లోపల ఓ గుహ నుండి అకస్మాత్తుగా భారీగా నీరు ఎంట్రీ ఇచ్చినట్టు గాయపడిన కార్మికులు చెబుతున్నారు.

ALSO READ: ఎర్రకోట పేలుడు వెనుక ‘అల్ ఖైదా’.. ఐరాస భద్రతా మండలి సంచలన నివేదిక!

ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రదేశంలో సహాయక చర్యల్లో నిమగ్నమ్యాయి. సొరంగం నుండి నీటిని బయటకు పంపడానికి మూడు పెద్ద పంపులను ఏర్పాటు చేశారు.  కొన్నిరోజులుగా చమోలిలో అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం కుండపోత వర్షం పడింది. అదంతా పర్వత ప్రాంతం కావడంతో చిన్న నదులు-వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో సొరంగంలోకి నీరు వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు.

 

 

Related News

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

LPUలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హాస్టల్‌లో లైంగిక దాడి ఆరోపణలు.. రణరంగంగా మారిన క్యాంపస్!

యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!

పబ్లిక్ టాయిలెట్ లో ఇద్దరు యువకుల శవాలు.. ఎవరు చంపారు?

Big Stories

Advertisement
×