E-Paper
Advertisement

వాహనదారులకు బిగ్ షాక్.. ఇంటి ముందు పార్కింగ్‌ చేస్తే రూ.25 వేలు, కొత్త రూల్స్ ఎక్కడో తెలుసా?

వాహనదారులకు బిగ్ షాక్.. ఇంటి ముందు పార్కింగ్‌ చేస్తే రూ.25 వేలు, కొత్త రూల్స్ ఎక్కడో తెలుసా?
Advertisement

Bengaluru City: దేశంలోని పెద్ద, చిన్నా నగరాల్లో పార్కింగ్ అనేది సమస్యగా మారింది. వాహనాల మాట ఏమోగానీ కనీసం నడవడానికి ప్లేస్ లేకుండా పోతోంది. దీన్ని గమనించిన ప్రభుత్వాలు చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇంటి ముందు వాహనం పార్కింగ్ చేస్తే ప్రభుత్వానికి మనీ కట్టాల్సిందే. కొత్త రూల్స్‌ బెంగుళూరు సిటీలో అమల్లోకి రానున్నాయి. అసలు మేటరేంటి?

 

వాహనదారులకు బిగ్ షాక్

Advertisement

దేశంలోని మెట్రో నగరాల్లో పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. టూ వీలర్స్ పక్కనపెడితే మిగతా వాహనాల్లో రోడ్లపై పార్కింగ్ చేస్తున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే.. వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో ఏమీ చేయలేక పోలీసులు సైతం సైలెంట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కేవలం మార్కెట్, ప్రధాన రోడ్లు మాత్రమే కాదు, వీధుల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. కనీసం వాహనాల పార్కింగ్‌కు ఖాళీ స్థలం లేకుండా ఇళ్లు కట్టేస్తున్నారు. దీన్ని గమనించిన కర్ణాటక శివకుమార్ సర్కార్, కొత్త పార్కింగ్ రూల్స్ తీసుకురాబోతోంది.

 

బెంగుళూరు సిటీలో కొత్త రూల్స్

Advertisement

బెంగుళూరు సిటీవాసులకు బిగ్ అలర్ట్. ఇళ్లు ముందు, పబ్లిక్ రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే వేలల్లో రుసుం చెల్లించాల్సిందే. గ్రేటర్ బెంగళూరు అథారిటీ-జీబీఏ ‘పార్కింగ్ రూల్స్-2026’ ముసాయిదా తీసుకురానుంది. దీని ప్రకారం వాహనదారులు ఏటా రూ. 25 వేలు వరకు చెల్లించి రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ పొందడం తప్పనిసరి చేయనుంది. వాహనాన్ని బట్టి వార్షిక పార్కింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ముసాయిదా నిబంధనల మేరకు హ్యాచ్‌బ్యాక్ కార్లు రూ. 15 వేలు, సెడాన్‌ అయితే రూ. 20 వేలు, ఎస్‌యూవీ, స్పోర్ట్స్ కార్లకు రూ. 25 వేలుగా ప్రతిపాదన చేశారు. అందులో కీలకమైన, కఠినమైన నిబంధనను తీసుకొచ్చారు. భవన నిర్మాణ నిబంధనల మేరకు కనీస పార్కింగ్ సౌకర్యం ఉన్న భవనాల్లో నివాసం వారికి మాత్రమే.

ఇంటి ముందు పార్కింగ్‌ చేస్తే రూ.25 వేలు

అపార్ట్‌మెంట్ లేదా ఇంటి చట్ట ప్రకారం సొంత పార్కింగ్ స్థలంలేని వారు వీధుల్లో పార్కింగ్ చేసేందుకు పర్మిట్ పొందలేరు. వాహనాలు అడ్డ దిడ్డంగా పార్క్ చేయడంవల్ల తీవ్రమైన సమస్యగా మారింది. పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలను ప్రతిపాదన చేసింది. రోడ్లపై వాహనాలు నిలిపితే చట్టవిరుద్ధమైన పార్కింగ్‌గా భావించి జరిమానాలు విధిస్తారు. పర్మిట్‌ అనేది ఒక నిర్దిష్ఠ వ్యక్తి-వాహనానికి జారీ చేస్తారు. కాల పరిమితి కేవలం ఏడాది మాత్రమే. ఆ తర్వాత దరఖాస్తుదారుడు ఆ ప్రాంతంలో ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత పునరుద్ధరిస్తారు అధికారులు. ఆ లెక్కన గృహ యజమానులు తమ ఇంటి ఆవరణలో వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఈ ముసాయిదా ప్రధాన ఉద్దేశం.

ALSO READ: ఉత్తరాఖండ్‌ సొరంగంలో ఘోర ప్రమాదం.. 7 కార్మికులు మృతి, ఆరుగురు గల్లంతు

దీనివల్ల వీధిలో పార్కింగ్‌ను కట్టడి చేయడం, వీధికి దూరంగా పార్కింగ్ సౌకర్యాలను పెంచాలని ఆలోచన చేస్తోంది. సిటీలో ప్రజలకు అందుబాటులో ఉండేలా  పార్కింగ్ స్థలాల సంఖ్యను పెంచాలని ఆలోచన చేస్తోంది. ఈ విధంగా చేయడంవల్ల నివాస, నివాసేతర ప్రాంతాల్లో వీధి పార్కింగ్‌ నియంత్రించవచ్చు. వేరే ప్రాంతంలో పార్కింగ్ చేస్తే నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. ట్రాఫిక్ కోసం కనీసం 6 మీటర్ల రోడ్డు, పాదచారుల కోసం ఇరువైపులా 1.8 మీటర్ల ఫుట్‌పాత్ ఖాళీగా ఉంచాలనే నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ముసాయిదా దశలో ఉండగా, తుది నిర్ణయం రెండు వారాల్లో వెలువడే అవకాశముంది.

Related News

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

LPUలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హాస్టల్‌లో లైంగిక దాడి ఆరోపణలు.. రణరంగంగా మారిన క్యాంపస్!

యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!

పబ్లిక్ టాయిలెట్ లో ఇద్దరు యువకుల శవాలు.. ఎవరు చంపారు?

Big Stories

Advertisement
×