E-Paper
Advertisement

స్టీరింగ్ గేర్ వైఫల్యం.. తీరానికి దూసుకొచ్చిన భారీ నౌక.. ఒడ్డున ఉన్నోళ్లు పరుగో పరుగు!

స్టీరింగ్ గేర్ వైఫల్యం.. తీరానికి దూసుకొచ్చిన భారీ నౌక.. ఒడ్డున ఉన్నోళ్లు పరుగో పరుగు!
Advertisement

Ship Crash: బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లా డైమండ్ హార్బర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. సింగపూర్‌కు చెందిన 147 మీటర్ల పొడవైన భారీ సరుకు రవాణా నౌక.. హుగ్లీ నదిలో పయనిస్తూ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. వేగంగా తీరం వైపునకు దూసుకొచ్చి.. అక్కడ ఉన్న నూర్పూర్ ఫెర్రీ టెర్మినల్‌ను బలంగా ఢీకొట్టింది.

తప్పిన ప్రాణనష్టం.. పగుళ్లు వారిన తీరం

ప్రమాదం జరిగే సమయానికి ఫెర్రీ టెర్మినల్ వద్ద ఎటువంటి పడవలు, లాంచీలు నిలిపి ఉంచకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నౌక చాలా బలంగా ఢీకొట్టడంతో నదీ తీరం వెంట పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పరిపాలనా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

Advertisement

మలేషియా నుంచి వస్తుండగా ప్రమాదం

ప్రమాదానికి గురైన ఈ సింగపూర్ నౌకను ‘ఎంవీ నవత భూమ్’ (MV Nawata Bhum)గా గుర్తించారు. ఈ నౌక మలేషియాలోని ‘పోర్ట్ క్లాంగ్’ నుంచి భారీ కంటెయినర్లతో కోల్‌కతా పోర్ట్ వైపునకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతాకు దక్షిణాన దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమండ్ హార్బర్ వద్ద.. మలుపు తిరుగుతుండగా నౌక ఒక్కసారిగా కంట్రోల్ తప్పింది. నౌకలోని స్టీరింగ్ గేర్ వ్యవస్థ వైఫల్యం చెందడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.

Advertisement

Also Read: ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? రచ్చలేపిన జర్నలిస్ట్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన పాక్ ఆర్మీ!

ముందే వార్నింగ్.. తప్పిన ముప్పు

నౌక కంట్రోల్ తప్పడంతో నౌకలోని సిబ్బంది వెంటనే అప్రమత్తయ్యారు. తీరంలో ఉన్న ప్రజలు, అధికారులను హెచ్చరిస్తూ.. నిరంతరం హార్న్ మోగించారు. అది గమనించిన వారంతా.. నౌక వస్తున్న వైపునకు దూరంగా వెళ్లిపోయారు. దీంతో భారీ నౌక వేగంగా తీరం వెంబడికి దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకొచ్చాయి. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. బస్సులు, లారీల తరహాలోనే.. భారీ నౌకలకు సైతం స్టీరింగ్ సమస్య ఉంటుందా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Also Read: ఎయిర్‌టెల్ బిగ్ షాక్.. ఒకేసారి 4 చౌకైన ప్లాన్లు తొలగింపు.. ఇక మీ జేబుకు చిల్లే!

Tags

Related News

ఢిల్లీలో చెంపదెబ్బ వీడియో కలకలం.. అసలు నిజం బయటపెట్టిన మంత్రి పర్వేష్ వర్మ!

కరెంట్ వాడకంపై కేంద్రం కీలక ఆదేశాలు.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!

ఢిల్లీలో షాకింగ్ న్యూస్.. ఓ యువకుడిని చెంప దెబ్బ కొట్టిన ఢిల్లీ మంత్రి?

విరిగిన కొండచరియలు.. బద్రీనాథ్ – రిషికేశ్ మధ్య నిలిచిన రాకపోకలు, చిక్కుకున్న 4 వేల యాత్రికులు

యూపీలో మారిన సీన్.. రాహుల్-అఖిలేష్ ఒక్కటయ్యారా? గెలుపు ఎవరిది?

షాకైన వాహనదారుడు, గిటార్‌పై AI రూ. 500 చలాన్! బెంగుళూరులో ఘటన

ఓ ఫేక్ వార్త.. ఎల్‌పియులో ధ్వంసం..విశ్వవిద్యాలయానికి నిప్పు, హైవేను దిగ్బంధించిన స్టూడెంట్స్

రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. వెంటనే అప్లై చేసేయండి

Big Stories

Advertisement
×