Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ జెట్లలో డబ్బు తరలించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు కేంద్రంగా నగదు బదిలీ అయినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రైవేట్ జెట్ విమానాల ద్వారా నగదు తరలించినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే శరత్‌చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. శరత్ చంద్రారెడ్డి భార్య కనిక నడుపుతున్న సంస్థ ద్వారా లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. జెట్‌సెట్ గో సంస్థ ద్వారా డబ్బులు బదిలీ అయినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. జెట్‌సెట్ గో సంస్థ సీఈవోగా శరత్‌చంద్రారెడ్డి భార్య పనిచేస్తున్నారు. ఇక్కడ నుంచి నడిపిన ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ వివరాలు కావాలని ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడి గత నెల 17న లేఖ రాసింది. ఎయిర్‌పోర్టు అథారిటీని ఆ వివరాలు ఇవ్వాలని కోరింది.