BigTV English

Safe cities in India | దేశంలో అత్యంత సురక్షితమైన నగరాలు..

Safe cities in India | నేషనల్ క్రైం రికార్డ్స బ్యూరో(NCRB -National Crime Records Bureau) తాజా నివేదిక ప్రకారం దేశంలో అత్యంత సురక్షితం నగరంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా అగ్రస్థానంలో నిలిచింది. గత మూడు సంవత్సరాలు కోల్ కతా అత్యంత సురక్షితమైన నగరంగా నిలవడం మరో విశేషం.

Safe cities in India | దేశంలో అత్యంత సురక్షితమైన నగరాలు..

Safe cities in India | నేషనల్ క్రైం రికార్డ్స బ్యూరో(NCRB -National Crime Records Bureau) తాజా నివేదిక ప్రకారం దేశంలో అత్యంత సురక్షితం నగరంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా అగ్రస్థానంలో నిలిచింది. గత మూడు సంవత్సరాలు కోల్ కతా అత్యంత సురక్షితమైన నగరంగా నిలవడం మరో విశేషం. NCRB 2022 నివేదికలో అత్యంత తక్కువ నేరాలు నమోదవుతున్న నగరాల జాబితా విడుదల చేసింది. ఇందులో కోల్ కతా నగరంలో దేశంలోని మిగిలిన నగరాల కంటే తక్కువ నేరాలు నమోదయ్యాయి.


కోల్ కతా తరువాత రెండవ స్థానంలో పుణె, మూడవ స్థానంలో హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రతి లక్షమంది జనాభాకు సగటున నమోదవుతున్న నేరాల సంఖ్య ఆధారంగా NCRB నివేదిక రూపొందించింది. NCRB గణాంకాల ప్రకారం.. 2022 సంవత్సరంలో ప్రతి లక్ష మంది జనాభాకు సగటున కోల్ కతా నగరంలో 86.5 కేసులు నమోదయ్యాయి. రెండవ స్థానంలో ఉన్న పుణె నగరంలో 280.7 కేసులు నమోదకాగా.. మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరంలో 299.2 కేసుల నమోదయ్యాయి.

అదే ఇంతకుమందు 2021 సంవత్సరం నివేదికతో పోల్చితే.. కోల్ కతా లో ప్రతి లక్ష జనాభాకు సగటున 103.4 కేసలు నమోదయ్యాయి. అదే పుణెలో 256.8, హైదరాబాద్‌లో 259.9 కేసులు నమోదయ్యాయి. అంటే గత సంవత్సరం కంటే కోల్ కతా నగరంలో నేరాలు తగ్గాయి.. అదే పుణె, హైదరాబాద్ నగరాలో నేరాల సంఖ్య మరింత పెరిగింది.


సురక్షితమైన టాప్ 9 నగరాల జాబితా
1.కోల్ కతా
2.పుణె
3.హైదరాబాద్
4.ముంబై
5.బెంగుళూరు
6.సూరత్
7.అహ్మదాబాద్
8.ఢిల్లీ
9.చెన్నై

మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, రాష్ట్రాలలో నేరాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. నివేదిక ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా అల్లర్లు జరుగుతున్నాయి. 2022లో అల్లర్లకు సంబంధించి 8218 కేసులు నమోదు కాగా.. ఆ తరువాతి స్థానాల్లో ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి.

ఉత్తర్ ప్రదేశ్‌లో అత్యధికంగా క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. 4,01,787 క్రిమినల్ కేసులు ఉత్తర్ ప్రదేశ్‌లో నమోదు కాగా.. రెండవ స్థానంలో 3,74,038 క్రిమినల్‌ కేసులతో మహారాష్ట్ర ఉంది. అలాగే ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధిక హత్యా కేసులు నమోదవుతున్నాయి.

Related News

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

×