E-Paper
Advertisement

ఇండియాకు అనుకూలంగా మాట్లాడుతున్నాన‌ని, దేశద్రోహి ముద్ర వేశారు

ఇండియాకు అనుకూలంగా మాట్లాడుతున్నాన‌ని, దేశద్రోహి ముద్ర వేశారు
Advertisement

Danish kaneria On pakistan cricketers: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా గురించి తెలియని వారు ఉండరు. పాకిస్తాన్ లో పుట్టి పెరిగిన కనేరియా… నిత్యం ఇండియాకు సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. గుజరాత్ లో డానిష్ కనేరియా ( Danish kaneria ) పూర్వికులు ఉండేవారు. 1970 తర్వాత పాక్ లోని కరాచీకి అత‌ని కుటుంబం వలస వెళ్ళింది. అందులోనూ కనేరియా హిందూ కుటుంబానికి సంబంధించిన వాడు. అందుకే ఇండియా అంటే గౌరవంతో కనేరియా మాట్లాడుతూ ఉంటారు. అయితే పాకిస్తాన్ జట్టులో కనేరియా ఉన్నప్పుడు.. చాలా సార్లు అతడిని అవమానించారు తోటి క్రికెటర్లు. ఇప్పటికి కూడా అదే ట్రోలింగును ఎదుర్కొంటున్నాడు కనేరియా.

ఇండియాకు అనుకూలంగా మాట్లాడుతున్నాన‌ని, దేశద్రోహి ముద్ర వేశారు

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ( Danish kaneria ) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దేశంలో తనకు భద్రత లేదని బాంబు పేల్చారు. ఇండియాకు తాను అనుకూలంగా మాట్లాడినందుకు… టార్గెట్ చేస్తున్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు అనుకూలంగా మాట్లాడినందుకు.. తనపై దేశద్రోహి ముద్ర వేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్ జట్టులో ఉన్నప్పుడు కూడా తనను ఇలాగే కొంతమంది తన తోటి క్రికెటర్లు వ్యవహరించారని ఆరోపణలు చేశారు. తాను హిందువు కాబట్టి.. టార్గెట్ చేసినట్లు వివరించారు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

తన పూర్వీకులు ఇండియాకు సంబంధించిన వారన్న ఒక్క కారణంతో, ప్రతిసారి డ్రెస్సింగ్ రూమ్ లో అవమానాలను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా టార్గెట్ చేస్తూనే ఉన్నారని బాంబు పేల్చారు. తాను తరచూ ఇండియాకు అనుకూలంగా మాట్లాడతానని… కొంతమంది పాకిస్తాన్ వెధవలు తనపై దేశద్రోహి ముద్ర వేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇండియా నుంచి వ‌లస వ‌చ్చినందుకు అవ‌మానిస్తున్నారు

Advertisement

తన కుటుంబం గుజరాత్ ప్రాంతం నుంచి ఎప్పుడో పాకిస్తాన్ కు వలస వచ్చిందని గుర్తు చేశారు కనేరియా. కానీ, తాను పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేయలేదని వెల్లడించారు. ఎల్లప్పుడూ పాకిస్తాన్కు పూర్తి నిజాయితీతో.. గర్వంతో ప్రాతినిధ్యం వహించానని తెలిపారు. కానీ, ఇండియాకు అప్పుడప్పుడు అనుకూలంగా మాట్లాడినందుకు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.

ప్రధాని నరేంద్ర మోడీపై కనేరియా ప్రశంసలు

పాకిస్తాన్ దేశంలో పుట్టి పెరిగిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.. నిత్యం హిందువు భారతదేశాన్ని ప్రశంసిస్తూనే, ప్రధాని నరేంద్ర మోడీపై కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. హిందూ ధర్మాన్ని కాపాడే శ్రీరామచంద్రుడు అంటూ నిత్యం సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుంటారు. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేసినప్పుడు కూడా.. ప్రధాని నరేంద్ర మోడీకి సపోర్ట్ గా నిలిచారు.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

 

Related News

మీ కాళ్లు పట్టుకుంటా, దయచేసి పాకిస్తాన్ ప్లేయర్లను ఐపీఎల్‌లోకి తీసుకోండి

ముంబై ఇండియన్స్‌లోకి బాబర్ ఆజం…అంబానీపై ట్రోలింగ్ షురూ ?

విరాట్ కోహ్లీతో బాబ‌ర్ ను పోల్చేవాళ్ల‌ను పిచ్చాస్ప‌త్రిలో వేయాలి

టీమిండియాకు నరకం చూపించైనా 2027 వరల్డ్ కప్ గంభీర్ అందించేలా ఉన్నాడు

అల్లా మీద ఒట్టు..టీమిండియాను వ‌రుణుడు కూడా కాపాడ‌లేడు, సెమీ ఫైనల్స్ లోనే ఎలిమినేట్

ఫైనల్స్ లో టీమిండియాను ఓడించి, గోల్డ్ మెడల్స్ నేల‌కేసి కొట్టండి

ఏషియన్ గేమ్స్ ఫైనల్స్‌లో దిక్కుమాలిన రూల్స్…వర్షం పడితే టీమిండియా పని గోవిందా ?

రియాలిటీ షో చేయాలంటూ రూ.12 కోట్ల ఆఫర్..ఛీ కొట్టిన విరాట్ కోహ్లీ ?

Big Stories

Advertisement
×