Voting Percentage in Lok Sabha Elections 2024 Highlights: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఓటింగ్ జరగుతుంది. ఇందులో అధికార YSRCP, కాంగ్రెస్ నేతృత్వంలోని I.N.D.I.A కూటమి, BJP, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని TDP, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని NDA మధ్య ముక్కోణపు పోటీ ఉంది.
ఒడిశాలోని 28 శాసనసభ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల సంఘం ప్రకారం 4వ దశలో జరిగే ఎన్నికల్లో 10 రాష్ట్రాలు/యూటీల నుంచి మొత్తం 1,717 మంది అభ్యర్థులు భవితవ్యం తేల్చుకోనున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేశంలో 40.32 శాతం పోలింగ్ నమోదైంది. వివిధ రాష్ట్రాల్లోని పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: MK Meena on polling percentage: పోలింగ్ శాతం పెరిగిందన్న మీనా, అది పాజిటివ్ అన్న వైసీపీ