Big Stories

Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా ముగిసిన రెండో విడత పోలింగ్.. 61 శాతం ఓటింగ్..!

Second Phase Voting: దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 88 లోక్ సభ స్ఠానాలకు రెండో దశలో పోలింగ్ జరిగింది. దేశంలోని 13 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైన్లట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

- Advertisement -

పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా మిగిసింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసింది. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

సాయంత్రం 5 గంటల వరకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన సమాచారం ప్రకారం.. అస్సాంలో 70.66 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్ గఢ్ లో 72.13 శాతం, జమ్ముకశ్మీర్ లో 67.22 శాతం. కర్ణాటకలో 63.90 శాతం, బిహార్ లో 53.03 శాతం, కేరళలో 63.97, మధ్యప్రదేశ్ 54.83, మహారాష్ట్ర 53.51, మణిపుర్ 76.06, రాజస్థాన్ 59.19, త్రిపుర 77.53, ఉత్తరప్రదేశ్ 52.74, పశ్చిమబంగాల్ 71.84 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Also Read: నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఏమవుతుంది.? ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసు

కాగా, మే 7వ తేదీన మూడో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే మొత్తం 7 దశల్లో ఈసారి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News