BigTV English

Loksabha results 2024, NDA vs INDIA bloc History return: హ్యాట్రిక్‌పై ఎన్డీయే కన్ను, తగ్గేదే లేదంటున్నఇండియా కూటమి

Loksabha results 2024, NDA vs INDIA bloc History return: హ్యాట్రిక్‌పై ఎన్డీయే కన్ను, తగ్గేదే లేదంటున్నఇండియా కూటమి

Loksabha results 2024, NDA vs INDIA bloc History return: దాదాపు రెండున్నర నెలల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడబోతోంది. రానున్న ఐదేళ్లు దేశాన్ని ఎవరు పాలిస్తారు? ఎన్డీయే లేక ఇండియా కూటమా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ ఎన్డీయేకు అనుకూలంగా వచ్చినా, నేతల్లో మాత్రం టెన్షన్ వెంటాడుతోంది. ఈవీఎంల్లో ఓటు ఎవరివైపు మొగ్గు చూపుతుందోనని ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.


ఎప్పుడూ లేని విధంగా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. 400 సీట్లు గెలుస్తామని పైకి చెబుతున్నా లోపల మాత్రం ఎంత ఫిగర్ వస్తుందనేది ఆ పార్టీ నేతలకు తెలుసు. కాకపోతే ప్రత్యర్థిని మానసికంగా వీక్ చేసేందుకు ఇదో ఎత్తుగడగా సీనియర్ నేతలు వర్ణిస్తున్నారు.

ఎన్డీయేకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇవ్వకూడదన్నది ఇండియా కూటమి ప్లాన్. అందుకు తగ్గట్టు గానే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని మరీ బరిలోకి దిగింది. ఇక మేజర్‌గా మహారాష్ట్రపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దేశ రాజకీయాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి శివసేన, ఎన్సీపీ చీలిపోయి బీజేపీ సపోర్టుతో పోటీ చేస్తున్నాయి.


ALSO READ: బెంగళూరులో భారీ వర్షం(వీడియో).. 133 ఏళ్ల రికార్డు బ్రేక్!

ఇక గుజరాత్, రాజస్థాన్, యూపీ, బీహార్‌ల్లో గత పదేళ్లుగా బీజేపీ అధిక సీట్లు సాధించింది. అక్కడ జరిగిన అభివృద్ధి గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈసారి అక్కడ బీజేపీకి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని స్థానిక సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తామన్నది ఇండియా కూటమి మాట. బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో బీజేపీకి సానుకూలంగా ఉంటుందనేది అక్కడి నేతలు చెబుతున్నారు. ఈసారి తమిళనాడు, కేరళలో బీజేపీ ఖాతా ఓపెన్ చేయడం ఖాయమని అంటున్నారు. గతంలో కంటే ఈసారి ఏపీ, తెలంగాణ‌ల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలన్నది కమలనాథుల ప్లాన్.

దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. సామాన్యుడు ఇంట్లో నుంచి కాలు బయట పెడితే జేబుకు చిల్లు పడుతోంది. ఆ రేంజ్‌లో అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. వీటిని కంట్రోల్ చేయలేక, అధికార ఎన్డీయే కొత్త పల్లవిని ఎత్తుకోవడం మొదలెత్తింది. ప్రపంచంలో  పెద్ద ఆర్థిక వ్యవస్థ, రోడ్లు, అందరికీ బ్యాంకు అకౌంట్లు అని మాత్రమే చెబుతోంది. దాని వెనుక ఏం జరుగుతుందనేది అందరికీ తెల్సిందే. ప్రజల సమస్యలను పక్కన‌పెట్టి చరిత్ర మీదే డిపెండ్ అయ్యింది బీజేపీ. ఈ పరిణామాల నేపథ్యంలో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారో తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే మరీ.

Tags

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×