BigTV English

Longest Hair : పొడవైన కురులు.. గిన్నిస్‌లోకి యూపీ మహిళ

Longest Hair : పొడవైన కురులు.. గిన్నిస్‌లోకి యూపీ మహిళ
 Longest Hair

Longest Hair : తలస్నానం చేయడానికి అతివలకు పది నిమిషాలు పడుతుందేమో.. మహా అయితే 15 నిమిషాలు పట్టొచ్చు.. కానీ స్మిత శ్రీవాస్తవ(46) మాత్రం 30-45 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఎందుకో మీరు గ్రహించే ఉంటారు. అవును. ఆమె కురులు చాలా పొడవు. ఎంత అంటే గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కేంతగా!


ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు ఉన్న మహిళగా స్మిత రికార్డులను బద్దలు కొట్టింది. ఆమె జుట్టు పొడవు 7 అడుగుల 9 అంగుళాలు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్మిత తన 14వ ఏట నుంచి తల వెంట్రుకలను పెంచడం ఆరంభించింది. ఈ విషయంలో ఆమెకు తల్లే స్ఫూర్తి. స్మిత తల్లి జుట్టు కూడా ఆరోగ్యంగా, ఎంతో పొడవుండేది.

1980ల్లో వెండితెరను ఏలిన హిందీ నటీమణుల పొడవాటి అందమైన కురులను చూసిన స్మిత.. వారినే అనుకరించింది. కురులు ఎంత పొడవు ఉంటే అంత అందం ఇనుమడిస్తుందనేది ఆమె ఫిలాసఫీ. జుట్టు సంరక్షణకు కూడా ఎంతగానో శ్రమించేది. వారానికి రెండు సార్లు తలారా స్నానం తప్పనిసరి. దాంతో పాటు కురులను ఆరబెట్టడం, ఆపై అలంకరణ కోసం స్మితకు పట్టే సమయం మొత్తం 3 గంటలు.


ఆ సమయంలో రాలిన తల వెంట్రుకలను సైతం ఆమె భద్రపరిచింది. కష్టపడి పెంచుకున్న వెంట్రుకలను గిరాటేయడం స్మితకు ఎంత మాత్రం ఇష్టం లేదు. పొడవైన కురులున్న మహిళగా రికార్డుల్లోకి ఎక్కినా.. ఒక్కోసారి అదే ఆమెకు తలనొప్పిగా మారేది. నడుస్తుంటే కాళ్లకు ఆ వెంట్రుకలే అడ్డుపడేవి. అలా కూడా కొన్ని సార్లు జుట్టు ఊడిపోయేది. గత 20 సంవత్సరాలుగా రాలిన తన వెంట్రుకలను ఆమె భద్రపరుస్తుండటం విశేషం.

తప్పనిసరి పరిస్థితుల్లో ఒకే ఒక్కసారి మాత్రం జట్టును కత్తిరించింది. అదీ రెండో సారి గర్భిణి అయినప్పుడు. దాదాపు అడుగు పొడవు మేర వెంట్రుకలను కత్తిరించేసింది. కాళ్లకు అడ్డం పడకుండా జట్టు ఆరు అడుగులే ఉండేలా చూసుకుంది. ఇక ఆ పొడవాటి జట్టును విరబోసుకుని వీధిలోకి వెళ్తే అందరూ సంభ్రమాశ్చర్యలతో చూసేవారని స్మిత తెలిపింది.

కొందరు తనతో ఫొటోలు దిగేవారని, మరికొందరు ఆ జట్టును తాకి సంబరపడేవారని పేర్కొంది. అందమైన, ఆరోగ్యకరమైన పొడవాటి కురుల కోసం ఏం చేస్తారంటూ అడిగే వారికి లెక్కేలేదని వివరించింది. గిన్నిస్ రికార్డుల్లోకి తన పేరు ఎక్కడంపై స్మిత ఎంతో ఆనందపడింది. ఓపికున్నంత కాలం జట్టును మరింతగా పెంచడానికే కృషి చేస్తానని చెప్పింది.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×