BigTV English

Bhole Baba Assets : భోలేబాబా ఆస్తుల చిట్టా.. ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది

Bhole Baba Assets : భోలేబాబా ఆస్తుల చిట్టా.. ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది

Bhole Baba Assets List : యూపీలోని హాథ్రస్ జిల్లాలో జూలై 2న భోలే బాబా నిర్వహించిన సత్సంగ్ లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. ఇంకా అనేకమంది తీవ్రగాయాల పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలు ఇప్పటికీ గుండెలవిసేలా రోధిస్తున్నాయి. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న పిల్లలు, పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు.. అనాధలుగా మిగిలారు. తాజాగా బాధిత కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరుగుతున్నదని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.


అయితే.. ఘోర దుర్ఘటనకు కారణమైన భోలే బాలా అలియాస్ సూరజ్ పాల్ సింగ్ అలియాస్ నారాయణ్ సాకార్ ఎక్కడున్నాడో ఇంతవరకూ పోలీసులకు తెలియలేదు. భోలే బాబా ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఘటనకు బాధ్యుల్ని చేస్తూ.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా భోలే బాబా ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఆస్తులు, విలాసాలపై ఒక నేషనల్ మీడియా వెల్లడించిన విషయాలు చూస్తే.. ఎవ్వరికైనా దిమ్మతిరగాల్సిందే.

Also Read : హాథ్రాస్‌‌లో రాహుల్.. బాధితులకు పరామర్శ


ఆశ్రమంలోని విశ్వసనీయ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. భోలే బాబాకు దేశంలో 2 ఆశ్రమాలున్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల విలువ రూ.100 కోట్ల పైమాటే. సెక్యూరిటీ విషయానికొస్తే.. ప్రజల్లోకి వచ్చేటపుడు 16 మంది వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. ఆయన కారుకు ముందు 350 సీసీ బైక్ లపై వెళ్తూ.. రూట్ క్లియర్ చేస్తారు. ఆయన వెనుక 5 నుంచి 30 కార్లతో కాన్వాయ్ ఉంటుంది.

మెయిన్ పురిలో ఉన్న ఒక ఆశ్రమంలోనే భోలే బాబా నివాసం. ఆ ఆశ్రమాన్ని హరినగర్ గా పిలుస్తారు. సుమారుగా 13 ఎకరాల్లో నిర్మించారు. భోలే బాబా, అతని భార్య కోసం 6 విలాసవంతమైన గదులుంటాయట. ఆశ్రమం ఎంట్రన్స్ లో దానికి వారాళాలిచ్చిన 200 మంది భక్తుల పేర్లు కనిపిస్తాయని.. రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకూ విరాళమిచ్చిన దాతలపేర్లను రాయించారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఇటావాలో మరొక ఆశ్రమ నిర్మాణం కూడా చేపట్టారు. ఇంకా తవ్వితే భోలే బాబాకు ఎన్ని ఆస్తులున్నాయో, ఎంతమంది బినామీలుగా ఉన్నారో, ఆయన ఎవరికి బినామీగా ఉన్నారో కూడా తెలిసే అవకాశాలు లేకపోలేదు.

 

 

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×