E-Paper
Advertisement

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం
Advertisement

Chandrapur District: దారుణమైన ఘటన మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో వెలుగులోకి చూసింది. విద్యార్థులు సరిగా చదవలేదని 82 మందికి అరగుండు కొట్టించారు పాఠశాల సూపరింటెండెంట్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు అధికారులు.

మహారాష్ట్రలో దారుణమైన ఘటన

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ ఆశ్రమ పాఠశాల నడుస్తోంది. చిమూరు తాలుకాలోని జంభుల్ ఘాట్‌లో ప్రభుత్వ పాఠశాలల అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సరిగా చదవలేదని 82 మంది విద్యార్థుల అర గుండు చేసిన బయటపడింది. ఈ సంఘటన శనివారం ప్రభుత్వ సెకండరీ ఆశ్రమ పాఠశాలలో జరిగింది. పాఠశాల నుండి అందిన సమాచారం ప్రకారం.. శనివారం ఉదయం విద్యార్థులకు జుట్టు కత్తిరిస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది ఆడుకుంటున్నట్లు తెలిసింది.

82 మంది విద్యార్థులకు అరగుండు, ప్రశ్నిస్తే కుంటుసాకులు

Advertisement

విద్యార్థుల ప్రవర్తనతో మనస్తాపం చెందారు పాఠశాల సూపరింటెండెంట్ ప్రశాంత్ మెష్రామ్. దీంతో 82 మంది విద్యార్థులకు జుట్టులో సగం కత్తిరించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ట్రిమ్మర్ వాడటంతో విద్యార్థుల జుట్టు సరిగ్గా కత్తిరించకుండా సగం పూర్తి కాకుండా మిగిలిపోయాయి. సగం గుండు చేయించుకున్న పిల్లల ఫోటోలు ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో వచ్చాయి. అవి వైరల్ అవ్వడంతో వారి తల్లిదండ్రులలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత ఉన్నతాధికారులు పాఠశాలను సంప్రదించారు.

షోకాజ్ నోటీసు జారీ, చర్యలు తీసుకోవాల్సిందేనన్న పేరెంట్స్

ఇక మీడియా వెర్షన్ విషయానికి వద్దాం. రెండు విడతలుగా విద్యార్థులకు జుట్టు కత్తిరింపు చేసినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి సుమారు 11 గంటలకు ప్రారంభమైన ఈ అమానుష ఘటన, ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల వరకు సాగింది. విద్యార్థుల జుట్టును రాత్రిపూట మళ్లీ ఎందుకు కత్తిరించారు? ఇలాంటి అధికారం ఎవరు ఇచ్చారని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ గిరి.. సూపరింటెండెంట్ ప్రశాంత్ మెష్రామ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

Advertisement

ALSO READ: భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని మెష్రామ్ సమర్థించారు. వర్షాల కారణంగా విద్యార్థులు క్రమం తప్పకుండా జుట్టు కత్తిరించుకోలేకపోతున్నారని, అందుకే వారి జుట్టును పొట్టిగా కత్తిరిస్తున్నామని అన్నారు. ఈ ఘటనపై విచారణ జరపాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ విషయం వెలుగులోకి రాగానే గిరిజన అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఆశ్రమ పాఠశాలను సందర్శించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల వాంగ్మూలాలను విడిగా నమోదు చేయాలని, అధికారుల పాత్రను పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related News

భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

10 సీఎన్‌జీ బస్సులు దగ్ధం.. షార్ట్ సర్క్యూట్ కారణమా? ముంబైలో ఘటన

మహాత్మా గాంధీని అవమానించేలా రీల్.. పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్

‘దృశ్యం-3’ సినిమా చూసి ప్లాన్.. 2000 కి.మీ ప్రయాణించి.. గొడ్డలితో తండ్రి హత్య!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. రంగంలోకి సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘానికి నోటీసులు

‘రే*ప్ చేస్తే చస్తామనే భయం పుట్టించాలి’.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

బాల్యంలో లైంగిక దాడి.. 20 ఏళ్ల వయసులో తాతపై యువతి ప్రతీకారం.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి హత్య!

Big Stories

Advertisement
×