DMHO Swarna Kumari: లక్ష రూపాయల లంచం… హాస్పటల్ రీ ఓపెన్‌కి డీల్… DMHO ACB రైడ్స్‌లో బయటపడ్డ స్వర్ణకుమారి బాగోతం. లైసెన్స్ లేదనే కారణంతో LB నగర్‌లోని ఓ ఫిజియోథెరపీ ఆస్పత్రిని అధికారులు మూసివేశారు. ఆ హాస్పిటల్‌ను తిరిగి ఓపెన్ చేసుకోవడంతో పాటు కొత్త లైసెన్స్ ఇచ్చేందుకు 2 లక్షలు డిమాండ్ చేసినట్లు ACBకి ఫిర్యాదు అందింది.
మెుదటి విడతగా లక్ష ఇస్తుండగా..
మొదటి విడతగా లక్ష ఇస్తుండగా హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, డ్రైవర్ కృష్ణయ్య ద్వారా ఆ మొత్తాన్ని స్వీకరించారు. అప్పుడే ACB అధికారులు ఎంటర్ అయి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్వర్ణకుమారితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని DMHO కార్యాలయంలో ACB అధికారులు సోదాలు చేశారు. సోమవారం నుంచి కొనసాగతున్న సోదాల్లో DMHO స్వర్ణకుమారికి సంబంధించిన పలు కీలక ఫైల్స్, డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ACB దర్యాప్తు..
లైసెన్స్‌ల వ్యవహారంలో ఇంకా ఏమైనా అక్రమాలు ఉన్నాయా..? కీలక ఆధారాలు ఏమైనా బయటపడతాయా అన్న కోణంలో ACB దర్యాప్తు కొనసాగుతుంది. లక్ష రూపాయల లంచంతో మొదలైన కేసు.. ఇప్పుడు DMHO ఆఫీస్‌లో ఫైల్స్ వరకు వెళ్లింది. ACB సోదాలు పూర్తయ్యేలోపు మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: మద్యం లెక్కలు తీసిన మంత్రి జూపల్లి.. BRS హయాంలో 260% పెరిగితే, మా పాలనలో..!