E-Paper
Advertisement

మద్యం లెక్కలు తీసిన మంత్రి జూపల్లి.. BRS హయాంలో 260% పెరిగితే, మా పాలనలో..!

మద్యం లెక్కలు తీసిన మంత్రి జూపల్లి.. BRS హయాంలో 260% పెరిగితే, మా పాలనలో..!
Advertisement

Jupally Krishna Rao: రవీంద్రభారతి ప్రాంగణంలో సాంస్కృతిక, పర్యాటక, మలేషియా సమ్మేళన కార్యక్రమాల అనంతరం మీడియా ప్రతినిధులతో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చిట్ చాట్ చేస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలనూ ఘనవిజయంతో కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

మద్యం రాబడిపై స్పష్టత

Advertisement

రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా పెంచింది గత BRS ప్రభుత్వమేనని మంత్రి జూపల్లి తీవ్రంగా విమర్శించారు. 2014లో మద్యం ఆదాయం రూ.10 వేల కోట్లు ఉంటే, 2023 డిసెంబర్ నాటికి ఏకంగా రూ.35 వేల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. పదేళ్లలో BRS పాలనలో రాబడి 260 శాతం పెరిగితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేవలం 10 శాతం మాత్రమే పెరిగిందని వివరించారు. రాష్ట్రంలో తాగుడు పెరగలేదని, పక్క రాష్ట్రాల్లో ఉన్న పన్నుల విధానమే ఇక్కడా అమలవుతోందన్నారు. పూర్, క్యూర్, గ్రేటర్ హైదరాబాద్ సిటీ పరిధిలోనే 40 వైన్ షాపులు పెరిగాయని, కొత్త బ్రాండ్ల అనుమతి అనేది నిరంతరం జరిగే సాధారణ ప్రక్రియేనని చెప్పారు. ఎల్ నినో ప్రభావం బీర్ల ఉత్పత్తిపై ఏమీ పడలేదని స్పష్టం చేశారు.

సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాలు

Advertisement

కృష్ణా జలాలు, డిండి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డితో సమీక్షా సమావేశం జరిగిందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో కలవకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టు పెరగకపోయినా అంచనా వ్యయం మాత్రం భారీగా పెరిగిందని మండిపడ్డారు. ఎదుర్ల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తీసుకుంటే తెలంగాణకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. శ్రీశైలంలో నీటిమట్టం 850 అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించకుండా గతంలో తానే స్వయంగా స్టే తెచ్చానని గుర్తుచేసుకున్నారు. పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కొన్నిరోజుల పాటు నీరు వచ్చిందని, తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పుడు లండన్ వంటి దేశాల్లో కార్ వాషింగ్ కూడా నిషేధించే నిబంధనలు ఉంటాయని పేర్కొన్నారు.

Also Read: కాంగ్రెస్ గెలిస్తే ఓకే.. ఓడిపోతే EVMల తప్పా? రాహుల్ గాంధీకి బీజేపీ సూటి ప్రశ్నలు!

Tags

Related News

బీజేపీలో మహిళలకు రక్షణ లేదా.. మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారిపై కేసు నమోదు!

రేవంత్, కేసీఆర్ ఆస్తుల వివాదం.. హైకోర్టులో ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు!

లక్ష రూపాయల లంచం.. ACB వలలో DMHO స్వర్ణకుమారి!

ఐదు రోజలు ఉండాల్సిందే.. తేల్చి చెప్పేసిన టీఆర్ఎస్ చీఫ్ కవిత

కాంగ్రెస్ గెలిస్తే ఓకే.. ఓడిపోతే EVMల తప్పా? రాహుల్ గాంధీకి బీజేపీ సూటి ప్రశ్నలు!

ఎల్‌నినో దెబ్బకు ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరి స్థానంలో ఇవి వేస్తే కాసుల వర్షమే!

కోళ్ల ఫారాల్లో డ్రగ్స్ తయారీ.. ఈగల్ ఫోర్స్ సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×