Maharashtra Couple: మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఓ నవదంపతుల ఉదంతం తీవ్ర తీవ్ర విషాదాన్ని, అనేక అనుమానాలను నింపింది. కొన్ని నెలల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ జంట, అనూహ్యంగా తాపి నదిలో శవాలై తేలడం స్థానికంగా పెద్ద కలకలం రేపింది.
తాపి నదిలో కలకలం
ధూలే జిల్లా పరిధిలోని తాపి నదిలో ఉదయం వేళ రెండు మృతదేహాలు తేలుతుండటాన్ని గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి చూసేసరికి షాక్‌కు గురయ్యారు. వారిద్దరి కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి, తాళం వేసి ఉండటంతో ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నది ఒడ్డున వారి ద్విచక్ర వాహనం కూడా లభ్యమైంది.
ఎవరీ దంపతులు?
మృతులను అమల్నేర్ తాలూకా పడల్సారే గ్రామానికి చెందిన శ్యామ్ హరి పాటిల్ (28), సప్నా శ్యామ్ పాటిల్ (20)గా గుర్తించారు. కొద్ది నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులు ఉట్రాన్ గ్రామంలో నివాసముంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా వీరు ఇంట్లో కనిపించడం లేదని స్థానికులు వెల్లడించారు.
పోలీసుల అనుమానాలు
నీటి నుంచి బయటపడకుండా ఉండేందుకే వారే స్వయంగా కాళ్లకు గొలుసులు వేసుకుని నదిలో దూకేశారా? లేక ఎవరైనా పారిపోకుండా కాళ్లకు గొలుసులు కట్టి బలవంతంగా నదిలోకి తోసేసి చంపేశారా? అనే ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు పోలీసులు అన్ని కోణాల్లో తీవ్రంగా విచారిస్తున్నారు.
Also Read: రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!