Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమం ఒకటి. ప్రతివారం ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు పాల్కొంటూ వారికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈవారం ఈ కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు మహేష్ అచంట(Mahesh Achanta) పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది ఇందులో భాగంగా మహేష్ తన సినిమా కెరియర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ తన లవ్ బ్రేకప్స్(Love Breakups) గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు.
మహేష్ అచంట బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉండేవారు. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగిన ఈయన అనంతరం వెండితెరపై సినిమాలలో అవకాశాలను అందుకున్నారు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ ఈ సినిమా తర్వాత తిరిగి వెనక్కి చూసుకోలేదు. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ ను ఉద్దేశించి వర్ష మాట్లాడుతూ.. మీకు ఇప్పటివరకు ఎన్ని బ్రేకప్స్ జరిగాయి అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు మహేష్ సమాధానం చెబుతూ తనకు ఇప్పటివరకు ఏకంగా ఆరు బ్రేకప్స్ జరిగాయని తెలిపారు. ఇలా ఒకేసారి ఆరుసార్లు లవ్ బ్రేకప్ అయిందనే విషయం తెలిసిన అభిమానులు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.ఒక్కరు పడటమే కష్టంగా ఉంది మీరు అంత మందిని ఎలా పడేశారు బ్రో అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయన లవ్ చేసిన ఆరు మందిలో ఏ ఒక్కరిని కూడా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. మహేష్ వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే. ఇలా భార్య పిల్లలతో మహేష్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇక మహేష్ ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన నాన్న గురించి కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలో ఇలాంటి రోజులు రాకూడదని ఏదైనా ఉన్నాయి అంటే అవి నాన్నని మిస్ అయిన రోజని తెలిపారు. అదేవిధంగా తన రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో జరిగిన సంఘటనల గురించి కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ ఆచంట మాట్లాడారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో ఈయన ఎలాంటి విషయాల గురించి మాట్లాడారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి. ఈ ఎపిసోడ్ ప్రతి ఆదివారం సాయంత్రం 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం అవుతుంది.
Also Read: భార్యతో గొడవలు… సెలబ్రిటీల నుంచి ఫోన్లు.. అసలు విషయం చెప్పిన మహేష్!