E-Paper
Advertisement

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?
Advertisement

KCR BJP: స్వేచ్చ బ్యూరో: కేసీఆర్ బీజేపీకి భయపడుతున్నారని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం ప్రజలందరికీ తెలుసు అని వివరించారు. కేంద్రంలో మోదీ, అమిత్ షాల రాజకీయ తీరుపై, సీఈసీ నిర్ణయాలపై దేశమంతటా విపక్షాలు పోరాడుతుంటే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

దాదాపు 90 లక్షల ఓట్లు..

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు, ఇతర ఫార్ములా ఈ కేసుల్లో అరెస్టు చేస్తారనే భయంతోనే కేసీఆర్ బీజేపీకి లొంగిపోయారని ఆరోపించారు.ఇక
నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడే మాటల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. వివిధ కారణాలు చూపుతూ రాష్ట్రంలో దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించే ప్రక్రియ దురుద్దేశపూర్వకంగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో టీఎన్ శేషన్, జెఎమ్ లింగ్డో, టీఎస్ కృష్ణమూర్తి వంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ల హయాంలో పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఓటర్ల జాబితా ప్రక్రియలు జరిగాయని గుర్తుచేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో దళితులు, మైనారిటీలు, గిరిజనుల ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు.

టీపీసీసీ చీఫ్​ డిమాండ్..

Advertisement

వెస్ట్ బెంగాల్‌లో రోహింగ్యాల పేరు చెప్పి మమతా బెనర్జీని, బీహార్‌లో ఆర్‌జేడీని అడ్డుకున్న తరహాలోనే.. ఇప్పుడు తెలంగాణ, పంజాబ్‌లను బీజేపీ తమ తదుపరి టార్గెట్‌గా మార్చుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు ఉండటానికి ఇల్లు కూడా లేదని చెప్పుకునే కేటీఆర్‌కు ఫైవ్ స్టార్ హోటళ్లు ఉన్నాయని, ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్​ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్లు డాక్టర్ చరణ్​ కౌశిక్, డాక్టర్ రియాజ్ లు ఉన్నారు.

Also read: సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

Tags

Related News

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

Big Stories

Advertisement
×