E-Paper
Advertisement

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో : ప్రజల తీర్పును కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించదని, వారికి ఆ అలవాటే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉంటే ప్రజాస్వామ్యం.. లేకపోతే రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారం చేస్తారంటూ కిషన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ వ్యవహారశైలిలో ఒక వింత, విచిత్రమైన, ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తోందని ఎద్దేవాచేశారు. రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు తమకు అనుకూలంగా వ్యవహరించినప్పుడు అవి ప్రజాస్వామ్యబద్ధమైనవని ప్రశంసించడం, తమ పార్టీకి  ప్రజల్లో వ్యతిరేకత వచ్చినపుడు రాజ్యాంగబద్ధ సంస్థలు అవినీతిమయమయ్యాయని, వాటిని ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందని, వాటికి విశ్వసనీయత లేదని ఆరోపించడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిపోయిందని ఫైరయ్యారు.

ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారింది..

Advertisement

ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘాన్ని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను, న్యాయవ్యవస్థను, పార్లమెంట్ తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించలేదనే కారణంతో ఆయా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు తనానికి అద్దం పడుతోందన్నారు. రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజ్యాంగ వ్యతిరేక సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని, కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు కూడా ఈ రాజకీయ కుట్రలో భాగమేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలు తనకు అనుకూలంగా వ్యవహరించని సందర్భాల్లో.. వాటిని నిర్వీర్యం చేసే విధంగా ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని, కాంగ్రెస్ ఇటీవల పదే పదే అబద్ధాలను ప్రచారం చేయడం, రాజకీయ ఆందోళనలకు దిగడం, అమాయక యువతను రెచ్చగొట్టడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, ఆ చట్టబద్ధ సంస్థల పనితీరును అనుమానించేలా.. ప్రయత్నించడం రాహుల్ రాజకీయ కుట్రలాగా నిత్యకృత్యంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు.

మీరు విఫలమైతే ఈసీ తప్పు ఎలా అవుతుంది?

Advertisement

రాహుల్ గాంధీపై విశ్వాసం లేక దేశ ప్రజలు మిమ్మల్ని పదేపదే అనేక ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా తిరస్కరిస్తుంటే అది ఎన్నికల సంఘం తప్పు కాదన్నారు. ప్రజల్లో విశ్వసనీయతను సంపాదించుకోవడం, ప్రజల మద్దతు కూడగట్టి ఓట్లు పొందడం ఆయన బాధ్యత అని, కానీ ఆ విషయంలో మీరు పూర్తిగా విఫలమవుతున్నారన్నారు. దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో వరుసగా తమ పార్టీ ఓటమిపాలవుతుండటంతో ఆక్రోషం, ఆవేదనలతో దేశంలోని రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదకరమైన రాజకీయ విధానాన్ని రాహుల్ గాంధీ ఏకైక ఎజెండాగా ఎంచుకున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Also Read: ‘మొత్తం నగరాన్ని బంద్ చేయడం ఏంటి’? ఢిల్లీ లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

Tags

Related News

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

మరీ ఇంత ఘోరమా.. హుస్సేన్ సాగర్‌లో ఆరేళ్ల పాపను విసిరేసిన కన్నతల్లి..!

Big Stories

Advertisement
×