Upcoming Compact EVs in India: భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ క్రమంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా తక్కువ ధర, చిన్న సైజు, నగరాల్లో ఈజీ డ్రైవింగ్ తో ఉండే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈ విభాగంపై దృష్టి పెడుతున్నాయి. హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, విన్ ఫాస్ట్ వంటి కంపెనీలు కొత్త మోడళ్లను సిద్ధం చేస్తున్నాయి. త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న ఐదు కాంపాక్ట్ ఈవీలపై ఓ లుక్ వేయండి.
హ్యుందాయ్ భారత మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఓ కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ మోడల్ 2026 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సుమారు 500 కిలోమీటర్ల వాస్తవ ప్రపంచ రేంజ్‌ను అందించేలా దీనిని రూపొందిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. చిన్న సైజులో ఉన్నప్పటికీ ఆధునిక డిజైన్, విశాలమైన క్యాబిన్, అధునాతన ఫీచర్లతో ఈ కారు రానున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లోకి వస్తే టాటా పంచ్ ఈవీ, మహీంద్రా XUV 3XO EVలకు ఇది ప్రత్యర్థిగా మారవచ్చు.
మహీంద్రా తన పాపులర్ XUV 3XOకి ఎలక్ట్రిక్ వెర్షన్ ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లకు దగ్గరగా ఉండే బాడీ డిజైన్ ను కొనసాగించినప్పటికీ, ఎలక్ట్రిక్ మోడల్ కు ప్రత్యేకమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. బ్యాటరీ సామర్థ్యం, డ్రైవింగ్ రేంజ్ లాంటి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే, కంపెనీ ఎలక్ట్రిక్ SUV లైనప్‌లో XUV 3XO EV కూడా కీలక మోడల్ గా నిలిచే అవకాశం ఉంది.
వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లోకి చిన్న ఎలక్ట్రిక్ SUV VF 3ని తీసుకురావడంపై ఆసక్తి చూపుతోంది. ఈ మోడల్ ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. VF 3లో 18.6kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. చిన్న పరిమాణం కారణంగా ప్రధానంగా నగర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. భారత్ లో విడుదలైతే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ SUV కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ గా మారనుంది.
టాటా పంచ్ ఈవీ ఇప్పటికే దేశీయ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్న పరిమాణంతో పాటు SUV తరహా డిజైన్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ దీని ప్రధాన ఆకర్షణలు. కొత్త కంపెనీలు, కొత్త మోడళ్లు ఈ విభాగంలోకి వస్తున్న నేపథ్యంలో టాటా కూడా తన EV లైనప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే అవకాశం ఉంది.
టాటా మోటార్స్ నెక్స్ట్ జనరేషన్ నెక్సాన్‌పై కూడా పనిచేస్తున్నట్లు సమాచారం. కొత్త నెక్సాన్ ప్రస్తుత మోడల్ కంటే భిన్నమైన డిజైన్ తో పాటు పొడవైన వీల్ బేస్‌ను పొందే అవకాశం ఉంది. క్యాబిన్ లో ఎక్కువ స్థలం, కొత్త టెక్నాలజీ, ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో కనిపించవచ్చు. ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా లైనప్ లో కొనసాగితే, టాటా EV పోర్ట్ ఫోలియోలో ఇది మరో ముఖ్యమైన మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది.
Read Also: 2.7 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. భారత్ లోకి అడుగు పెట్టబోతున్న BYD పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కారు!