BigTV English

Mamata Banerjee Slams Congress | ‘కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో 40 సీట్లు రావడం కూడా కష్టమే.. దమ్ముంటే బిజేపీ అధికార రాష్ట్రాల్లో పోటీచేయాలి’

Mamata Banerjee Slams Congress | కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరుగబోయే లోక్ సభ ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావడం కష్టమే అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అన్నారు. కాంగ్రెస్ భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మమతా బెనర్జీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

Mamata Banerjee Slams Congress | ‘కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో 40 సీట్లు రావడం కూడా కష్టమే.. దమ్ముంటే బిజేపీ అధికార రాష్ట్రాల్లో పోటీచేయాలి’


Mamata Banerjee Slams Congress(Telugu breaking news): కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరుగబోయే లోక్ సభ ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావడం కష్టమే అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అన్నారు. కాంగ్రెస్ భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మమతా బెనర్జీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

కేంద్రంలో అధికార బిజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమి పార్టీలలో తృణమూల్ కాంగ్రెస్ కూడా ఒకటి. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ తమతో పొత్తుకు నిరాకరించిందని సిఎం మమతా బెనర్జీ చెప్పారు. తాము పొత్తుకు సిద్ధమే అయినా కాంగ్రెస్ అందుకు ఒప్పుకోలేదని అన్నారు.


కాంగ్రెస్‌కు దమ్ముంటే బిజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పోటీచేయాలని.. బిజేపీతో నేరుగా ఢీకొట్టాలని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ గాంధీ.. భారత్ న్యాయ్ యాత్ర చేస్తున్నట్లు ముందుగా తనకు సమాచారం ఇవ్వలేదనీ.. తనకు అధికారుల ద్వారా తెలిసిందని చెప్పారు. ”దమ్ముంటే ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో 300 సీట్లపై పోటీ చేయాలి.. అంతే కానీ బెంగాల్‌లో మాతోపాటు కూటమిలో ఉంటూ ఇక్కడ ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయడానికి వస్తారా?. ఇలా చేస్తే.. దేశవ్యాప్తంగా 40 సీట్లు కూడా రావడం కష్టమే.” అని కాంగ్రెస్ నాయకులపై మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లోని 42 స్థానాల్లో 22 సీట్లు తృణమూల్ కాంగ్రెస్‌కు, 18 సీట్లు బిజేపీకి, 2 సీట్లు కాంగ్రెస్‌కు దక్కాయి. ఈ ఫలితాలను బట్టి ఇండియా కూటమిలో ఉన్న ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటు చేయాలనుకున్నాయ. కానీ అది జరగలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లు గెలిచింది కాబట్టి.. ఇప్పుడు కూడా 2 సీట్లపై మాత్రమే పోటీ చేయాలని మమతా బెనర్జీ సూచించారు. కానీ కాంగ్రెస్ అందుకు ఒప్పుకోలేదు. బెంగాల్‌లో సిపిఎం పార్టీతో కలిసి అన్ని సీట్లపై పోటీ చేయబోతున్నట్ల తెలుస్తోంది. కానీ ఈ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదని.. మమతా బెనర్జీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భారత్ న్యాయ్ యాత్రంలో అన్నారు.

Mamata Banerjee, Trinamool Congress, Congress, alliance, West Bengal, Lok Sabha Elections, Rahul Gandhi,

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×