BigTV English
Advertisement

Mamata Banerjee : కాంగ్రెస్ కు షాక్.. లోక్ సభ ఎన్నికల్లో దీదీ ఒంటరి పోరు..

Mamata Banerjee : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ కి గట్టి షాక్‌ తగిలింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రకటించారు. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని వెల్లడించారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని దీదీ తెలిపారు

Mamata Banerjee : కాంగ్రెస్ కు షాక్.. లోక్ సభ ఎన్నికల్లో దీదీ ఒంటరి పోరు..

Mamata Banerjee : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ కి గట్టి షాక్‌ తగిలింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రకటించారు. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని వెల్లడించారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని దీదీ తెలిపారు


బెంగాల్‌ వరకు సీట్ల పంపకం విషయంలో మా పార్టీ కాంగ్రెస్‌తో టచ్‌లో లేదని మమతా బెనర్జీ తెలిపారు. సీట్ల పంపకంపై ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఎవరితోనూ మాట్లాడలేదన్నారు. తమ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల తర్వాత అఖిల భారతస్థాయిలో నిర్ణయం తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో కేవలం రెండింటిని మాత్రమే కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు తృణమూల్‌ కాంగ్రెస్ ముందుకు వచ్చిందని సమాచారం. కానీ కాంగ్రెస్ మాత్రం 10 నుంచి 12 సీట్లు డిమాండ్ చేసిందని తెలిసింది. మమత ఇందుకు అంగీకరించని నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్‌ చౌధరి ఆమెపై విమర్శలు గుప్పించారు. ఆమె అవకాశవాదని, సొంత బలంతో పోటీ చేయడం ఎలాగో కాంగ్రెస్‌కు తెలుసని దీదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే బెంగాల్‌ సీఎం నుంచి తాజా ప్రకటన వెలువడింది.


2014 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో కాంగ్రెస్‌ 4 స్థానాలు గెలుచుకుంది. 2019లో ఆ సంఖ్య రెండుకు పడిపోయింది. ఈ ప్రదర్శన కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు టీఎంసీ అనాసక్తికి కారణమని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

రాహుల్‌ గాంధీ నేతృత్వంలో జరుగుతోన్న భారత్‌ జోడో న్యాయ యాత్రపైనా మమత బెనర్జీ విమర్శలు చేశారు. గురువారం ఈ యాత్ర బెంగాల్‌లోకి ప్రవేశించనుంది. భారత్ జోడో న్యాయ యాత్ర రాష్ట్రానికి వస్తున్నారు. దాని గురించి తనకు సమాచారం ఇవ్వాలన్న మర్యాద వారికి లేదని ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బెంగాల్‌లోకి ప్రవేశించిన తర్వాత ఈ యాత్రలో తమ పార్టీ పాల్గొనకపోవచ్చని టీఎంసీ నేత ఒకరు వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి తమకు అధికారిక ఆహ్వానం అందలేదన్నారు. ఒకవేళ అందినా.. టీఎంసీ అందులో పాల్గొనకపోవచ్చని తెలిపారు.

బీజేపీను ఓడిస్తామని, అందుకోసం ఏమైనా చేస్తామని మమత బెనర్జీ చెప్పారు. మమతాజీ, తృణమూల్ పార్టీ.. ఇండియా కూటమికి బలమైన పిల్లర్‌ అని రాహుల్ స్పష్టంగా చెప్పారు. ఆమె లేకుండా ఇండియా కూటమిని ఊహించుకోలేమన్నారు. అలాగే భారత్‌ జోడో న్యాయ యాత్రలో చేరాల్సిందిగా కూటమికి చెందిన అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పలుమార్లు ప్రకటించారని కాంగ్రెస్ వెల్లడించారు. బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో గత ఏడాది విపక్ష ‘ఇండియా’ కూటమి ఏర్పడింది. కానీ ఈ ప్రకటనలతో విపక్ష పార్టీల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి.

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×