BigTV English

Man kills wife: కొంప ముంచిన మేకప్, అందంగా ఉందని తట్టుకోలేకోయాడు.. చివరకు చంపి, బాడీని..

Man kills wife: కొంప ముంచిన మేకప్, అందంగా ఉందని తట్టుకోలేకోయాడు.. చివరకు చంపి, బాడీని..

Man kills wife: అందంగా తయారు కావడమనేది ఓ కళ. ఇందుకోసం గంటల కొద్దీ సమయాన్ని కేటాయి స్తారు. అయినా ఒక్కోసారి అందంగా తయారు కాలేదు. ఈ విషయంలో కొందరు మాత్రమే సక్సెస్ అవు తారు. కానీ మనం చెప్పబోయే వ్యక్తి మరో టైపు. భార్య అందంగా తయారు కావడాన్ని తట్టుకోలేకపోయాడు. చివరకు చంపేసి బాడీని అడవిలో పడేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.


కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడి ప్రాంతం ఈ ఘటనకు వేదికైంది. 35 ఏళ్ల ఉమేష్- 32 ఏళ్ల దివ్య దంపతులు. అన్నివిషయాలు కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకునేవారు. కాకపోతే దివ్యకు చిన్న కోరిక ఉండేది. అందంగా తయారవ్వాలని భావించేది. ఈ క్రమంలో నిత్యం లిప్‌స్టిక్ వేసుకునేది. మరింత అందంగా ఉండేందుకు టాటూ కూడా వేయించుకుంది.

తనకంటే.. అందానికే భార్య ప్రయార్టీ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయాడు ఆమె భర్త. ఈ క్రమంలో ఉమేష్-దివ్య మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దివ్యపై భర్తకు అనుమానం పెరిగింది. పని మీద బయటకు వెళ్లినా భార్య విషయం గుర్తుకు వచ్చేది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించాడు. ఏం చేయాలి.. ఎలా చేయాలనేది నిత్యం ఆలోచించేవాడు. చివరకు ఆమెని చంపాలని నిర్ణయానికి వచ్చేశాడు.


ALSO READ:  కోల్‌కతా వైద్యురాలి కేసు.. మిడ్‌నైట్ అట్టుడుకిన కోల్‌కతా, ఆసుపత్రిలో విధ్వంసం

పరిస్థితి గమనించిన దివ్య.. భర్త టార్చర్ తట్టుకోలేకపోయింది. జీవితాంతం వేధింపులు తప్పవని భావించి విడాకు ల కోసం ఫ్యామిలీ కోర్టులో అప్లై చేసింది. మంగళవారం ఇద్దరూ కలిసి ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యా రు. ఇకపై తన భార్యను అనుమానించనని ఉమే ష్ చెప్పాడు. ఈ విషయాన్ని భార్యకు చెప్పి నమ్మించా డు. తన భర్తలో మార్పు చూసి షాకయ్యిందామె. దాని వెనుక ఉమేశ్ క్రిమినల్ ఆలోచనను అంచనా వేయలేకపోయింది.

కోర్టు నుంచి ఉమేశ్ దంపతులు కలిసి దేవాలయానికి వెళ్లారు. కొండపై దేవాలయం ఉండడంతో అక్కడికి తీసుకెళ్లాడు. దర్శనం తర్వాత అక్కడేవున్న తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి భార్యని దారుణంగా చంపేశాడు. మృతదేహాన్ని కనిపించకుండా చీలూరు అటవీ ప్రాంతంలో పడేశాడు.

సీన్ కట్ చేస్తే.. టెంపుల్ నుంచి ఉమేశ్ ఫ్రెండ్స్ వెళ్లిపోయారు. భార్యని అడవిలో పడేశాక ఉమేశ్ ఇంటికి చేరుకున్నాడు. కాకపోతే ఉమేశ్ ముఖ కవళికలు గమనించిన ఇరుగుపొరుగువాళ్లు దివ్య గురించి అడిగారు. ఫలానా దగ్గరకు వెళ్లిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పలుమార్లు నీళ్లు నమిలాడు. చివరకు ఈ వ్యవహారం పోలీసుస్టేషన్‌కు చేరింది.

పోలీసులు రంగంలోకి దిగేశారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, టెంపుల్ సమీపంలో ఉన్న ఫుటేజ్‌ పరిశీలించారు. ఉమేశ్‌తోపాటు మరో నలుగురు ఉండడం గమనించారు. వెంటనే ఆ నలుగురిలో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఉమేశ్‌తోపాటు మరొకరు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. సరైన భార్య దొరలేదని కొందరు, అందంగా లేదని మరికొందరు.. ఇతగాడు మాత్రం తన భార్య అందంగా తయారుకావడాన్ని తట్టుకోలేపోయాడు. ఆ అందమే దివ్యకు శాపంగా మారింది.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×