Global Hunger Index 2022 : 2022 ప్రపంచ ఆకలి సూచికలో భారత్ 107వ స్థానంలో నిలిచింది. భారత దేశంలో ఆకలి కేకలు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక కంటే ఎక్కువగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆసియాలో భారత్ పరిస్థితి దారుణంగా ఉంది. గత సంవత్సరం 101వ స్థానంలో ఉంటే ఈ ఏడాది మరింత క్షీణించి 107వ స్థానానికి దిగజారింది. మొత్తం 116 దేశాలు ఈ ఆకలి సూచికలో పాల్గొన్నాయి. భారత దేశంలో పిల్లలను ఆకలికి వదిలేసే శాతం కుడా దారుణ స్థితిలో.. 19.3 శాతంగా ఉంది. ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయం అని నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లో పౌష్టికాహార లోప్ 2018లో 14.6 శాతంగా ఉంటే.. 2021 వచ్చేసరికి 16.3 శాతానికి పెరిగింది. పిల్లల్లో పౌష్టికాహారా లోపం, ఎదుగుదల కుంటుపడ్డం కూడా రాష్ట్రాల మద్య భారీ వ్యత్యాసం ఉంది. భారత్‌లో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకి ఈ అంశంలో ఛత్తీస్‌గర్, గుజరాత్, ఒడిస్సా, తమిళనాడు మెరుగుపడినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఆకలి సూచికలో భారత్ స్థితిలో మండిపడ్డారు సీపీఎం కార్యదర్శ సీతారాం ఏచూరి. కేంద్ర ప్రభత్వం గత ఎనిమిదిన్నర ఏళ్ల నుంచి పాలిస్తోంది కాబట్టి దీనికి బాధ్యత వహించాలన్నారు. 2014 నుంచి ఆకలి సూచికలో భారత్ దిగజారిపోతోందన్నారు. మోదీ ప్రభుత్వమే దీనికి ప్రధాన కారణమన్నారు యేచూరి. “భారత్‌లో 22.4 కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నప్పుడు.. ఇలాంటి అంశాలపై ప్రధాని మోదీ ఎప్పుడు మాట్లాడుతారు”అని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రశ్నించారు.
వాస్తవానికి చూస్తే.. ఓ వైపు కరువు, మరోవైపు వరదలు, ఇంకో వైపు తీవ్రవాదం. అన్నింటికీ మించి కడు పేదరికంతో అల్లాడిపోతున్న పాకిస్థాన్ మనదేశంకన్నా మెరుగైన స్థానంలో ఉందీ అంటే నమ్మలేం. అందుకే ఈ 2022 ప్రపంచ ఆకలి సూచికలో భారత్‌కు ఇచ్చిన స్థానంపై భిన్నాభిప్రాయాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.