
Dal Lake : జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉన్న దాల్ సరస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాల్ లేక్‌లోని బోట్ హౌసెస్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పలు బోట్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 5 బోట్లు మంటల్లో కాలిపోయాయని అధికారులు పేర్కొన్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ఘాట్ నంబర్ 9 వద్ద మొత్తం 5 కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. అయితే కొంతమంది విద్యుద్ఘాతం వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. దీనిలో ఉగ్రవాదుల పనిగా.. మరికొందరు భావిస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల పనా? లేక ఎవరైనా కావాలనే మంట పెట్టారా? లేక విద్యుద్ఘాతమే కారణమా అనే యాంగిల్‌లో ఎంక్వైరీ చేస్తున్నారు. కాగా.. బోట్లకు మంటలంటుకుని తగలబడుతున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.