E-Paper
Advertisement

వివాదంలో ఎంకే స్టాలిన్.. మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ టీవీకే!

వివాదంలో ఎంకే స్టాలిన్.. మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ టీవీకే!
Advertisement

MK Stalin Sathyabama Remarks: టీవీకే ఉపఎన్నిక అభ్యర్థిని సత్యభామను లక్ష్యంగా చేసుకొని తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. గతంలో సీఎం హోదాలో పనిచేసిన వ్యక్తి.. దళిత మహిళా అభ్యర్థి శరీరాకృతిని ఉద్దేశించి (Body Shaming) మాట్లాడటం పట్ల అధికార పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో స్టాలిన్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ విషయంలై అధికార టీవీకే, విపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

ఇంతకీ స్టాలిన్ ఏమన్నారంటే?

శుక్రవారం ధరాపురం ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న స్టాలిన్, అధికారంలో ఉన్న టీవీకే పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్ష అన్నా డీఎంకే ఎమ్మెల్యేలను ఆకర్షించి ఆ పార్టీలో చీలికలు తెచ్చేందుకు టీవీకే హార్స్ ట్రేడింగ్ చేస్తోందని ఆరోపించారు. ఇదే క్రమంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున గెలిచి.. కొద్దివారాల్లోనే రాజీనామా చేసి టీవీకేలో చేరిన సత్యభామను ఆయన టార్గెట్ చేశారు. పార్టీ మారేందుకు భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. ‘ఆమెను (సత్యభామ ప్రజలు సూట్‌కేస్ భామ, సుమోర్సాల్ట్ (పిల్లిమొగ్గ) భామ అని అంటున్నారు. ఆ శరీరాకృతితో ఆమె ఎలా సుమోర్సాల్ట్ వేసిందో నాకైతే అర్థం కావడం లేదు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

Advertisement

దళితులను అవమానించడమే: టీవీకే

స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీవీకే తీవ్రంగా ప్రతిస్పందించింది. ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్ రాజ్ మాట్లాడుతూ… స్టాలిన్ వ్యాఖ్యలు స్పష్టంగా బాడీ షేమింగ్ కిందకే వస్తాయని అన్నారు. ఇది కేవలం సత్యభామను మాత్రమే కాకుండా మొత్తం మహిళా లోకాన్ని, దళిత సమాజాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. డీఎంకే అధినేత దీనికి బాధ్యత వహిస్తూ మహిళలకు క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు.

తమిళనాట ‘హార్స్ ట్రేడింగ్’ రచ్చ

Advertisement

మరోవైపు అధికార టీవీకేపై డీఎంకేతో పాటు అన్నాడీఎంకే సైతం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అవినీతి రహిత, సుపరిపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం విజయ్.. ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే మాజీ మంత్రులతో సహా ఆరుగురు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారని మండిపడుతోంది. వారిని తమ వైపు తిప్పుకోవడాన్ని ‘హార్స్ ట్రేడింగ్’కు పాల్పడిందని ఆరోపించింది. గతంలో జరిగిన విశ్వాస పరీక్ష సమయంలోనూ 20 మందికి పైగా రెబెల్ అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు.. టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడం గమనార్హం.

Also Read: జంతర్ మంతర్ 2.0.. అక్టోబర్ 10న చలో ఢిల్లీ.. సీఈసీకి బొద్దింకల పార్టీ అల్టిమేటం!

చట్టబద్ధంగానే చేరికలంటున్న టీవీకే

అయితే ఈ ఆరోపణలను టీవీకే పూర్తిగా తోసిపుచ్చింది. ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా రాజీనామా చేసి వేరే పార్టీలో చేరే హక్కు ఉందని పేర్కొంటోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి ఇది రాదని స్పష్టం చేస్తోంది. ఎమ్మెల్యేల నిర్ణయాలు పూర్తిగా వారి స్వచ్ఛందమైనవని సమర్థించుకుంటోంది. ప్రస్తుతం ఖాళీ అయిన స్థానాల్లో ధరాపురం, మదురాంతకం నియోజకవర్గాలకు మాత్రమే ఉపఎన్నికలు జరుగుతుండగా.. గతంలో గెలిచిన వారికే టీవీకే మళ్లీ టికెట్లు కేటాయించింది.

Also Read: ఫ్లైదుబాయ్ దాడి ఘటన.. కో-పైలెట్ వెనుక ఉగ్రకోణం.. వెలుగులోకి సంచలన నిజాలు!

Tags

Related News

జంతర్ మంతర్ 2.0.. అక్టోబర్ 10న చలో ఢిల్లీ.. సీఈసీకి బొద్దింకల పార్టీ అల్టిమేటం!

ఢిల్లీ దద్దరిల్లింది.. ముంబై హోరెత్తింది.. సర్‌ వివాదంలో జెన్ జీ 2.O అటాక్!

నైట్‌క్లబ్‌లో దారుణం.. మహిళ దుస్తులు ఊడదీసి విచక్షణారహిత దాడి.. వీడియోలు వైరల్!

‘విమానమే నా బిడ్డ ప్రపంచం.. భార్య కూడా అదే’.. కెప్టెన్ స్మిత్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

షాకింగ్ ఘటన.. గస్తీ కాస్తున్న మహిళా పోలీసుపై యువకుడి దాడి.. వీడియో వైరల్!

ర్యాపిడో పింక్ డ్రైవ్ వివాదం.. మహిళా రైడర్‌కి పురుష డ్రైవర్‌.. ‘నేను గే’ అంటూ విచిత్ర సమాధానం!

ఢిల్లీలో హైటెన్షన్.. మెట్రో, ఇంటర్నెట్ సేవలు బంద్.. రంగంలోకి 5 వేల బలగాలు!

Big Stories

Advertisement
×